Raja Roja Chora OTT Release Date Out: యంగ్ హీరో శ్రీవిష్ణు ఇటీవలె నటించిన చిత్రం ‘రాజ రాజ చోర’.కామెడీ ఎంటర్‌టైనర్‌గా విడుదలైన ఈ చితం త్వరలోనే ఓటీటీలో రిలీజ్ కానుంది. హితేశ్ గోలి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్లు. జిరాక్స్ షాపులో పనిచేసే భాస్కర్ (శ్రీవిష్ణు) అవసరాల కోసం చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. పైకి మాత్రం తాను ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని చెప్పుకుంటాడు.
చదవండి : 'మా'లో మార్పు తీసుకొస్తా: మంచు విష్ణు
అలా చెప్పుకొనే సంజన అలియాస్ సంజు(మేఘ ఆకాశ్)తో ప్రేమాయణం సాగిస్తాడు.అయితే భాస్కర్‌కు అప్పటికే విద్య( సునైన)తో పెళ్లి జరిగుతుంది. వాళ్లిద్దరికి ఒక బాబు కూడా ఉంటాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో ఓ కేసులో ఇరుక్కున్న భాస్కర్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అన్నదే సినిమా కథ. ఇప్పటికే థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం అక్టోబర్ 8నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment