Raja Raja Chora Movie
-
హాస్పిటల్ బెడ్‌పై తెలుగు క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?
'రాజ రాజ చోర' సినిమాతో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సునైన ఆస్పత్రి పాలయ్యారని తెలుస్తోంది. 2005లో కుమార్ వర్సెస్ కుమారి అనే తెలుగు చిత్రంతో వెండితెరకు హీరోయిన్గా పరిచయమైంది సునయన తెలుగులో సమ్‌థింగ్ స్పెషల్, 10th క్లాస్ సినిమాలు చేసింది. కాదలిల్ విడుంతేన్ అనే సినిమాతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడమే కాకుండా నీర్ పార్వై సినిమాకు గానూ ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు సైతం అందుకుంది. తమిళ బిగ్‌బాస్ 4 సీజన్లోనూ పాల్గొంది. విశాల్‌కు జోడీగా నటించి కోలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంటే.. తెలుగులో 'రాజ రాజ చోర' సినిమా ద్వారా క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. (ఇదీ చదవండి: నోటికొచ్చింది వాగుతున్న శివాజీ.. మళ్లీ మంచోడిలా కవరింగ్!) సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తాజా ఒక పోస్ట్ చేసింది. ఆ ఫోటో చూసిన అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. చేతికి సెలైన్ పెట్టుకుని ఆస్పత్రి బెడ్‌పై దిగిన ఫొటోను సునైన షేర్ చేసింది. అది కాస్త నెట్టింట వైరల్ అయింది. ఆమెకు ఏమైందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. కానీ ఏ కారణం వల్ల ఆమె ఆస్పత్రిలో చేరారో తెలపలేదు. కానీ త్వరలో మరింత దృఢంగా తిరిగి వస్తానని మాత్రం చెప్పుకొచ్చింది. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుతున్నారు. గతంలో హీరోయిన్ సునయన రెండు రోజులుగా కనిపించడం లేదంటూ కోలీవుడ్‌లో ఓ వార్త వైరల్‌గా మారింది. ఆమెను ఎవరో కిడ్నాప్ చేశారని ప్రచారం జరిగింది. తర్వాత అదంతా డ్రామా అని, ఒక సినిమా కోసం వాళ్లు చేసిన ఫ్రాంక్ వీడియో అని అసలు విషయం తెలిసింది. అప్పట్లో ఆమెపై పలు విమర్శలు వచ్చాయి. అదే మాదిరి ఇప్పుడు కూడా ఏదైనా సినిమా ప్రమోషన్స్ కోసం చేస్తున్నారా అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆమె తాజా చిత్రం ‘రెజీనా’ ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ లో స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంది. View this post on Instagram A post shared by Sunainaa Yeellaa (@thesunainaa) -
ఓటీటీలో దూసుకుపోతున్న 'రాజ రాజ చోర'
దసరా కానుకగా 'జీ 5'లో 'రాజ రాజ చోర' విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులకు నచ్చడంతో దీనికి బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా చూసిన నెటిజన్లు సోషల్‌మీడియాలో హీరో శ్రీవిష్ణు, హీరోయిన్లు సునైనా, మేఘా ఆకాష్ నటనను ప్రశంసిస్తూ... అనేకమంది కామెంట్లు పోస్టులు పెడుతున్నారు. థియెట్రికల్ రిలీజ్ తర్వాత అపూర్వమైన మార్కెటింగ్ క్యాంపెయిన్ చూసిన సినిమా ఇదేనని చెప్పాలి. ఈ సందర్భంగా పబ్లిసిటీ మారథాన్‌లో పాల్గొన్న శ్రీ విష్ణు, దర్శకుడు హసిత్ గోలీకి 'జీ5' టీం కృతజ్ఞతలు తెలిపింది. రచయిత - దర్శకుడు ప్రసన్న కుమార్ బెజవాడ సైతం సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. 'ఓ బేబీ' దర్శకురాలు నందిని రెడ్డి సినిమా గురించి సోషల్ మీడియాలో "మీరు వెండితెరపై అద్భుతమైన ఈ సినిమాను చూడడం మిస్ అయితే... ఇప్పుడు డిజిటల్ తెరపై చూసే అవకాశం మీకు దగ్గరకు వచ్చింది" అన్నారు. 'రాజ రాజ చోర' బ్లాక్ బస్టర్ సినిమా అని రచయిత - దర్శకుడు బివిఎస్ రవి పేర్కొన్నారు. టీవీ, ప్రింట్ ప్రమోషన్ల నుంచి డిజిటల్ మీడియా వరకు... ఇన్ఫ్లుయెన్సర్ల నుండి మీమ్ పేజీల వరకూ... సినిమాలో ఫన్నీ మూమెంట్స్ షేర్ చేయడం చూస్తుంటే 'రాజ రాజ చోర' ప్రజలు మెచ్చిన ఎంటర్టైనర్ అని స్పష్టమవుతుంది. 'జీ 5'లో తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు అద్భుత స్పందన అందుకున్న ఈ సినిమాను దసరా వీకెండ్ లో మరింత మంది చూసే అవకాశం ఉంది. అక్టోబర్ 22న 'జీ 5'లో 'హెడ్స్ & టేల్స్' విడుదల కానుంది. దీంతో మరింత ఎంటర్టైన్మెంట్ వీక్షకులకు అందించడానికి సిద్ధమవుతోంది. విమర్శకుల ప్రశంసలు పొందిన 'కలర్ ఫోటో' సినిమా టీమ్ నుంచి వస్తున్న సినిమా ఇది. ముగ్గురు మహిళలు, భగవంతుడు చుట్టూ తిరిగే అందమైన కథతో 'హెడ్స్ అండ్ టేల్స్' రూపొందింది. ఇందులో భగవంతుడిగా సునీల్ నటించగా... 140కి పైగా చిత్రాలకు సంగీతం అందించిన మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించారు. ప్రస్తుతం తెలుగు ప్రజలు కంటెంట్ బేస్డ్ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. చదవండి: MAA: బాలయ్యను కలిశాను, త్వరలో చిరంజీవిని కలుస్తా: మంచు విష్ణు -
ఓటీటీలో ‘రాజ రాజ చోర.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Raja Roja Chora OTT Release Date Out: యంగ్ హీరో శ్రీవిష్ణు ఇటీవలె నటించిన చిత్రం ‘రాజ రాజ చోర’.కామెడీ ఎంటర్టైనర్గా విడుదలైన ఈ చితం త్వరలోనే ఓటీటీలో రిలీజ్ కానుంది. హితేశ్ గోలి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్లు. జిరాక్స్ షాపులో పనిచేసే భాస్కర్ (శ్రీవిష్ణు) అవసరాల కోసం చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. పైకి మాత్రం తాను ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అని చెప్పుకుంటాడు. చదవండి : 'మా'లో మార్పు తీసుకొస్తా: మంచు విష్ణు అలా చెప్పుకొనే సంజన అలియాస్ సంజు(మేఘ ఆకాశ్)తో ప్రేమాయణం సాగిస్తాడు.అయితే భాస్కర్‌కు అప్పటికే విద్య( సునైన)తో పెళ్లి జరిగుతుంది. వాళ్లిద్దరికి ఒక బాబు కూడా ఉంటాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో ఓ కేసులో ఇరుక్కున్న భాస్కర్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అన్నదే సినిమా కథ. ఇప్పటికే థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం అక్టోబర్ 8నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. చదవండి : గ్రాండ్‌గా సుకుమార్ భార్య బర్త్‌డే సెలబ్రేషన్స్ -
విశాఖలో సందడి చేసిన ‘రాజ రాజ చోర’ టీం
ద్వారకానగర్ (విశాఖ దక్షిణ): నగరంలో రాజరాజ చోర చిత్ర నటీనటులు సందడి చేశారు. ఆదివారం ఉదయం చిత్ర యూనిట్ సభ్యులు సింహాచలం వరాహలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. సాయంత్రం సంగం, శరత్ థియేటర్లో ప్రేక్షకుల మధ్య హీరో శ్రీవిష్ణు, డైరెక్టర్ హసిత్ గోలి ఆడిపాడారు. చిత్ర బృందం ఆకస్మాత్తుగా థియేటర్లో ప్రత్యక్షమవడంతో ప్రేక్షకులు ఆనందంతో కేరింతలు కొట్టారు. వారితో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ విశాఖ నగరం అంటే తనకు ఎంతో ఇష్టమని, ఇదే సంగం, శరత్ థియేటర్లో గతంలో ఠాగూర్, అతడు వంటి చిత్రాలను ప్రేక్షకుడిగా చూశానని తెలిపారు. చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు హసిత్ గోలి మాట్లాడుతూ మా సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుందని, త్వరలో మాస్ ప్రేక్షకులకు మరింతగా దగ్గరయ్యే సినిమాలు చేస్తానని తెలిపారు. చదవండి : వైరల్ :రూబిక్స్ క్యూబ్‌తో చిరంజీవి పిక్చర్ పశుపతి హీరోగా మరో సినిమా.. షూటింగ్ ప్రారంభం -
‘రాజ రాజ చోర’ మూవీ రివ్యూ
-
‘రాజ రాజ చోర’ మూవీ రివ్యూ
టైటిల్ : రాజ రాజ చోర నటీనటులు : శ్రీవిష్ణు, మేఘా ఆకాష్, సునయన, రవిబాబు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్ తదితరులు నిర్మాణ సంస్థ : అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు : అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ దర్శకత్వం : హసిత్ గోలి సంగీతం : వివేక్ సాగర్ సినిమాటోగ్రఫీ : వేద రమణ్ శంకరన్ ఎడిటింగ్: విప్లవ్ విడుదల తేది : ఆగస్ట్ 19,2021 చిత్ర పరిశ్రమలో ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి.. విలక్షణ నటనతో, వైవిద్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో శ్రీవిష్ణు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. యావరేజ్ నుంచి మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారాడు. ఇలా వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఈ యంగ్ హీరో సెక్సెస్కి ‘గాలి సంపత్’ బ్రేక్ వేశాడు. దీంతో కాస్త వెనకడుగు వేసిన శ్రీవిష్ణు.. ఈ సారి ఎలాగైనా మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలనే కసితో ‘రాజ రారజ చోర’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై పాజిటీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. దీనికి తోడు మూవీ ప్రమోషన్స్ కూగా గ్రాండ్‌గా చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ‘రాజ రాజ చోర’ఏ మేరకు అందుకుంది? ఈ సినిమాతో శ్రీవిష్ణు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడా లేదా? రివ్యూలో చూద్దాం. రాజ రాజ చోర కథేంటంటే భాస్కర్ (శ్రీవిష్ణు) ఓ చిన్న దొంగ. ఓ జిరాక్స్ షాపులో పని చేస్తూ అవసరాల కోసం చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. పైకి మాత్రం తాను ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అని చెప్పుకుంటాడు. అలా చెప్పుకొనే సంజన అలియాస్ సంజు(మేఘ ఆకాశ్)తో ప్రేమాయణం సాగిస్తాడు. అయితే భాస్కర్‌కు అప్పటికే విద్య( సునైన)తో పెళ్లి జరిగుతుంది. వాళ్లిద్దరికి ఒక బాబు కూడా ఉంటాడు. అయినప్పటికీ భాస్కర్ సంజనతో ఎందుకు ప్రేమాయణం సాగించాడు? తాను ప్రేమించిన వ్యక్తి సాఫ్టవేర్ ఇంజనీర్ కాదనీ, అతనికి పెళ్లై, బాబు కూడా ఉన్నాడని తెలిసిన తర్వాత సంజన పరిస్థితి ఏంటి? దొంగగా పట్టుబడి పోలీసులకి చిక్కిన భాస్కర్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేదే మిగతా కథ ఎవరెలా చేశారంటే? ఎప్పటి మాదిరే శ్రీవిష్ణు మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. దొంగగా, సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా రెండు కోణాల్లో అద్భుత నటనను కనబరిచాడు. తనదైన మేనరిజమ్స్‌తో నవ్విస్తూనే.. ఎమోషనల్ సీన్స్‌ని కూడా అద్భుతంగా పండించాడు. సినిమా మొత్తం తన భూజాల మీద వేసుకొని కథని నడిపించాడు. హీరో భార్య విద్య పాత్రలో సునైనా ఒదిగిపోయింది. మధ్యతరగతికి చెందిన వివాహితగా ఆకట్టుకుంది. ఇక సంజూగా మేఘా ఆకాశ్ పర్వాలేదనిపించింది. పోలీస్ అధికారి విలియమ్ రెడ్డి పాత్రలో రవిబాబు ఒదిగిపోయిన తీరు బాగుంది. స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ.. అవినీతి పోలీసు అధికారిగా అదరగొట్టేశాడు. అంజమ్మ పాత్రలో గంగవ్వ మెప్పించింది. తనదైన పంచులతో నవ్వులు పూయిచింది. శ్రీకాంత్ అయ్యంగర్, అజయ్ ఘోష్, తనికెళ్ల భరణి తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే? అవసరాల కోసం దొంగగా మారిన ఓ వ్యక్తి.. తన తప్పును తెలుసుకొని మంచి వాడిగా ఎలా మారాడనేదే ఈ సినిమా కథ. మనసు మాట వినకుండా.. డబ్బు కోసం ఆశ పడి చేసే ఏ పనైనా తప్పే అనే సందేశాన్ని కామెడీ యాంగిల్లో చూపించాడు దర్శకుడు హసిత్ గోలి. దానికి కొంత ఎమోషనల్ టచ్ ఇచ్చి కథను నడిపించాడు. సాధారణంగా దర్శకులు సేఫ్‌గా ఉండేందుకు తమ తొలి సినిమాని ప్రేమ కథతో ప్రారంభిస్తారు. కానీ డైరెక్టర్ హిసిత్ మాత్రం తన డెబ్యూ మూవీనే ఇలాంటి కొత్త తరహా కథను చెప్పాలనుకొనే ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ.. అనుకున్నది తెరపై చూపించడంలో కాస్త తడబడ్డాడు. పాత్రలను పరిచయం చేయడానికి ఎక్కువ సమయం తీసుకున్నాడు. భాస్కర్, విద్యల సంబంధించిన సన్నివేశాలు మొదలయ్యాక కథలో వేగం పెరుతుంది. అయితే కథను సాగదీస్తూ అసలు విషయాన్ని ఇంటర్వెల్ వరకు లాగడం ప్రేక్షకులను కాస్త ఇబ్బంది పెడుతుంది. ఇంటర్వెల్ ముందు పోలీసులకు శ్రీవిష్ణు పట్టుబడినప్పుడు వచ్చే సన్నివేశాలు థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. అంతేకాదు సెండాఫ్‌పై అంచనాలను పెంచుతుంది. కానీ అక్కడ కూడా కథను నెమ్మదిగా సాగడం కాస్త మైనస్. కథను ఎమోషనల్‌గా డీల్ చేయడానికి స్కోప్ ఉన్నప్పటీ.. డ్రామాపైనే ఎక్కువ దృష్టిపెట్టాడు దర్శకుడు. సెకండాఫ్‌లో భాస్కర్ దొంగతనం చేసే సీన్స్ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే, తనికెళ్ల భరణి చెప్పే ప్రవచనాలతో ముడిపెడుతూ కథని నడిపించిన విధానం బాగుంటుంది. ఇక ఈసినిమాకు ప్రధాన బలం వివేక్ సాగర్ సంగీతం. పాటలు అంతంతమాత్రమే అయినప్పటికీ.. నేపథ్య సంగీతంతో అదరగొట్టేశాడు. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. సెకండాఫ్‌లో వచ్చే సిధ్ శ్రీరామ్ ఆకట్టుకోవడంతో పాటు ఆలోచించేవిధంగా ఉంటుంది. వేద రమణ్ శంకరన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ విప్లవ్ తన కత్తెరకు ఇంకా చాలా పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
అప్పటి వరకు వెంకటేశ్‌ని కలవొద్దని టార్గెట్ పెట్టుకున్నా : శ్రీవిష్ణు
సాక్షి, వెబ్‌డెస్క్: రాజ శ్రీవిష్ణు హీరోగా మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రాజ రాజ చోర’. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు శ్రీవిష్ణు. ఆయన చెప్పిన సంగతులేంటో చదివేయండి. అలాంటి వారికి ఇది రైట్ సినిమా ఇది కొత్త స్టోరీ. ఇందులో నేను దొంగ. పెద్ద స్కామ్ చేసే దొంగ కాదు. కొంటె దొంగని. 10 నిమిషాల్లోనే సినిమా క్యారెక్టర్లు అన్ని తెలిసిపోతాయి. ఆ తర్వాత నా క్యారెక్టర్ చుట్టూ కథ తిరుగుంది. మనం ఓటీటీలో ఇతర భాషల సినిమాలను చూసి పొగిడేస్తున్నాం కదా? అలాంటి వారికి ఇది రైట్ సినిమా. మన తెలుగు వాళ్లు ఈ జానర్లో చేసిన తొలి సినిమా ఇది. కచ్చితంగా అందరికి కనెక్ట్ అవుతుంది. కథే అలా మాట్లాడించింది ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంత ఎమోషనల్‌గా మాట్లాడానికి కారణం ‘రాజ రాజ చోర’కథే. నిజంగా ఈ కథ బాగా కుదిరింది. స్టోరీని ఎక్కువగా రివీల్ చేయడానికి వీల్లేదు. పబ్లీసిటీ కోసం అయితే అలా మాట్లాడలేదు. కథ గురించి చెప్పేసి.. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి నిరుత్సాహపరచడం నాకు ఇష్టం ఉండదు. నా కథ, షూటింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని మాత్రమే ప్రీరిలీజ్ ఈవెంట్లో చెప్తా. ఇందులో సిద్ శ్రీరామ్ ఓ పాట పాడారు. ఆ విషయం ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే థియేటర్లకు వచ్చిన తర్వాత ఆ సాంగ్ వింటేనే ఓ ఫీల్ కలుగుతుంది. అందుకే పబ్లిసిటీ కోసం వాడకుండా.. నిజాయతీగా సినిమాను థియేటర్లోకి తీసుకొస్తున్నాం. సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడానికి ఆలోచిస్తుంటారు. అలాంటి భయానికి ముందు నా కాన్ఫిడెన్స్‌ని ప్రెజంట్ చేస్తే బావుంటుందనిపించి స్టేజ్‌పై అలా మాట్లాడాను. అయితే నేను చెప్పిన మాటలు హృదయంలో నుంచి వచ్చినవే. టార్గెట్ పెట్టుకొని వెంకటేశ్‌ని కలిశా నేను వెంకటేశ్‌కు చాలా పెద్ద అభిమానిని. నటుడిగా మారాక ఆయనను కలిసే అవకాశం వచ్చినప్పటికీ కలవలేదు. మంచి సినిమాలు చేసి ఆయన నుంచి పిలుపు వచ్చే వరకు కలవొద్దని చిన్న టార్గెట్ పెట్టుకున్నాను. లక్కీగా ‘నీదీ నాదీ ఒకే కథ’తర్వాత వెంకటేశ్ నుంచి పిలుపు వచ్చింది. వెళ్లి కలిశా.. చాలా బాగా చేస్తున్నావని అభినందించారు. కథలు ఎంచుకునే విషయంలో డౌట్స్ ఉంటే ఆయన సలహాలు తీసుకుంటాను. పర్సనల్‌గా నాకవి ఎంతో హెల్ప్ అవుతూ వచ్చాయి. ‘రాజా రాజ చోర’ట్రైలర్ విడుదలైన వెంటనే.. ఫోన్ చేసి కామెడీ బాగుందని చెప్పారు. తాజాగా ఆయన ఇచ్చిన సలహా ఏటంటే.. అన్ని జానర్స్‌లో బాగా చేస్తున్నావు. మాస్ జానర్ కూడా ట్రై చేయమని చెప్పారు. లక్కీగా నేను తర్వాత చేయబోయే సినిమాలన్నీ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలే. అవి మాస్ ఆడియన్స్‌ని తప్పకుండా అలరిస్తాయి. పాన్ ఇండియా చిత్రమే నా గత సినిమాలన్నీ ఇతర భాషల్లో రిమేక్ చేశారు. కానీ ఎక్కడా చెప్పలేదు. రాజ రాజ చోర కచ్చితంగా ఇతర భాషల్లో రీమేక్ అవుతుంది. పాన్ ఇండియా స్టఫ్ ఉన్న సినిమా ఇది. కొత్త దర్శకులతో ఈజీ హిట్ ఇచ్చిన దర్శకులతో పనిచేస్తే రిలాక్స్ అయిపోతాం. అలా ఉండటం నాకిష్టముండదు. కొత్త దర్శకులతో చేసేటప్పుడు భయం, బాధ్యత ఉంటాయి. హ్యాండిల్ చేస్తారని నమ్మకం వచ్చినప్పుడు వాళ్లు బిడ్డలాగే భావించే సినిమా కరెక్ట్ వస్తుంటే వాళ్లు పడే ఆనందం చూస్తే నాకొక కిక్ వస్తుంది. ఫస్ట్ నుంచి నాకు అలా అలవాటైంది. అంతేకాకుండా కొత్త వాళ్లతో సినిమా చేయడం కిక్. వాళ్లతో సినిమా చేస్తే మన బుర్ర కూడా పదునెక్కుతుంది. నా సినిమాల్లో ఎక్కువగా కొత్తవాళ్లతో చేసినవే హిట్ అయ్యాయి. ఈ సినిమా చూసిన తర్వాత ముందు మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ గురించే మాట్లాడుతారు. తొలిసారి ఇద్దరితో తొలిసారి ఇద్దరు హీరోయిన్లు మేఘా ఆకాశ్, సునైనతో సినిమా చేశా. ఇద్దరు తెలుగు వాళ్లే. కానీ తమిళంలో ఎక్కువ సినిమాలు చేశారు. ఈ సినిమా తర్వాత తెలుగులో మంచి ఆఫర్స్ వస్తాయనే నమ్మకముంది. ప్రేక్షకుల మనసును దోచుకుంటా సినిమా జయా, అపజయాలు నా చేతుల్లో ఉండవు. కష్టపడి సినిమాలు చేస్తాం.. కొన్ని కారణాల వల్ల ఫెయిల్ అవుతుంటాయి. ఏ కారణాల వల్ల సినిమా పోయిందో చూసుకొని తదుపరి సినిమాల్లో తప్పిదాలు లేకుండా చూసుకుంటా. ప్రస్తుతం అర్జున పాల్గుణ, భళా తందనాన సినిమాలతో పాటు కాప్ బయోపిక్ చేస్తున్నా. ‘రాజ రాజ చోర’తో ప్రేక్షకుల మనసును కచ్చితంగా దోచుకుంటాను. -
కథ లేకుండా కామెడీ నడిపించలేం!
‘‘చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఇష్టం. నేను, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ బాల్య స్నేహితులం. ఇద్దరం కలిసి చేసిన షార్ట్ ఫిలింస్‌కు మంచి అభినందనలు వచ్చాయి. ‘మెంటల్ మది’లో చిత్రం ద్వారా తనకు డైరెక్టర్‌గా అవకాశం వచ్చింది. ఆ తర్వాత నేను కూడా ఎంట్రీ ఇచ్చాను’’ అని దర్శకుడు హసిత్ గోలి అన్నారు. శ్రీవిష్ణు హీరోగా మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రాజ రాజ చోర’. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలవుతోంది. (చదవండి: ఆ ఫొటో వల్లే సినిమా ఛాన్స్ వచ్చింది : వైశాలీ రాజ్) ఈ సందర్భంగా చిత్రదర్శకుడు హసిత్ గోలి మాట్లాడుతూ– ‘‘మా నాన్న గోలి హనుమత్ శాస్త్రి గృహ నిర్మాణ శాఖలో సివిల్ ఇంజనీర్. ఆయనకు సాహిత్యం అంటే చాలా ఇష్టం. అందుకే నాకూ సాహిత్యంపై అభిరుచి పెరిగింది. శ్రీవిష్ణు నటించిన ‘బ్రోచెవారెవరురా’ సినిమాకి దర్శకత్వ శాఖలో చేశాను. అంతకు ముందే శ్రీవిష్ణుకి చెప్పిన కథతో సినిమా చేద్దామనుకున్నాం. అయితే, దానికన్నా మంచి ఐడియా రావడంతో ‘రాజ రాజ చోర’ను స్టార్ట్ చేశాం. శ్రీవిష్ణులోని కామెడీని పూర్తి స్థాయిలో మా సినిమాలో చూపిస్తున్నాం. ఓ దొంగ ఎందుకు దొంగతనాలు చేస్తున్నాడు? అనేది కామెడీ కోణంలో చూపించాం. అయితే బలమైన కథ లేకపోతే కామెడీతోనే సినిమా రన్ అవుతుందనుకోను. అందుకే మంచి కథ తయారు చేసుకున్నాను’’ అన్నారు. (చదవండి: అంతదాకా వస్తే టీ.. కాఫీ అందించడానికీ రెడీయే!) -
ఈ వారం ఓటీటీ, థియేటర్స్‌లో సందడి చేసే చిత్రాలు ఇవే
కరోనా సెకండ్ వేవ్ పుణ్యమా అని మూతపడిన థియేటర్లు మళ్లీ తెరుచుకోవడంతో సినిమాల సందడి మొదలైంది. మొన్నటిదాకా ఓటీటీలలో సినిమాలు చూసి విసిగిపోయిన సినీ ప్రేక్షకులు.. థియేటర్ల బాట పట్టారు. దీంతో నిర్మాతలు తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేసేందుకు క్యూ కడుతున్నారు. ప్రతి వారం అర డజనుకు పైగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. గత వారం పాగల్, ఓరేయ్ బామ్మర్థి, బ్రాందీ డైరీస్తో పాటు మరో ఆరు సినిమాలు థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఈ వారం ఓటీటీ, ధియేటర్లలో విడుదల కానున్న సినిమాలు ఎంటో ఓ లుక్కేద్దాం. రాజ రాజ చోర యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా నటించిన తాజాగా చిత్రం ‘రాజ రాజ చోర’. మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్లు. హితేశ్ గోలి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలో శ్రీవిష్ణు స్మార్ట్ దొంగగా హిలేరియస్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 19న థియేటర్స్‌లో విడుదల కానుంది. కనబడుటలేదు హీరో సునీల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కనబడుటలేదు’.ఇందులో సునీల్ డిటెక్టివ్‌గా కనిపించనున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌కు ప్రేమకథను జోడించి దర్శకుడు బాలరాజు ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ చిత్రం ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. క్రేజీ అంకుల్స్ యాంకర్ శ్రీముఖి, మనో, రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘క్రేజీ అంకుల్స్’. ఇ. సత్తిబాబు దర్శకత్వం వహించారు. గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. బజార్ రౌడీ సంపూర్ణేష్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బజార్ రౌడీ’. డి. వసంత నాగేశ్వర రావు దర్శకుడు. మహేశ్వరి వద్ది కథానాయిక. బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో సంధిరెడ్డి శ్రీనివాసరావు నిర్మించారు. చిత్రం ఆగస్ట్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ ద స్కెలిటన్ ట్విన్స్ (ఆగస్టు 17) నైన్ పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ (ఆగస్టు 18) అన్నెట్టే (ఆగస్టు 20) కిల్లర్ ఎమాంగ్ అజ్ (ఆగస్టు 20) హోమ్ (ఆగస్టు 19) నెట్‌ఫ్లిక్స్ కామెడీ ప్రీమియం లీగ్ కామెడీ షో (ఆగస్టు 20) స్వీట్‌గర్ల్ (ఆగస్టు 21) ఆహా తరగతి గది దాటి ( ఆగస్టు 20) జీ 5 200 హల్లా హో (ఆగస్టు 20) ఆల్ట్ బాలాజీకార్టెల్ (ఆగస్టు 20) -
ఇప్పుడు ప్రయోగాలకు రెడీ!
‘‘లై, ఛల్ మోహన రంగ’ చిత్రాల తర్వాత తెలుగులో నాకు సరైన కథలు రాలేదు.. అందుకే ఏదీ ఒప్పుకోకపోవడంతో ఇక్కడ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్‌లో తమిళంలో మంచి స్క్రిప్ట్స్ రావడంతో అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాను. ప్రస్తుతం తెలుగులోనూ మంచి కథా బలం ఉన్న చిత్రాల్లో నటిస్తున్నాను’’ అని హీరోయిన్ మేఘా ఆకాశ్ అన్నారు. శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్ జంటగా నటించిన చిత్రం ‘రాజరాజ చోర’. హితేశ్ గోలి దర్శకత్వం వహించారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మేఘా ఆకాశ్ మాట్లాడుతూ.. ‘‘నేనెప్పుడూ భాష ఆధారంగా స్క్రిప్ట్స్ ఒప్పుకోను. మంచి కథ ఏ భాషలో ఉన్నా నటిస్తా. ‘రాజరాజ చోర’ కథ వైవిధ్యంగా ఉంది. నా నిజ జీవితానికి భిన్నమైన పాత్రను ఇందులో చేశాను. ఇప్పుడు ఓ స్థాయికి వచ్చాను కాబట్టి ప్రయోగాత్మక పాత్రలు చేయాలనుకుంటున్నాను. మా అమ్మ, నాన్న నా సినిమాల ఎంపికలో జోక్యం చేసుకోరు. అమ్మ కథ వింటుంది కానీ చేయాలా? వద్దా? అనే నిర్ణయం నాదే. ప్రస్తుతం ‘డియర్ మేఘ, మనుచరిత్ర, గుర్తుందా శీతాకాలం (అతిథి పాత్ర)’ చేస్తున్నాను. మరో సినిమా ప్రకటన త్వరలో వస్తుంది’’ అన్నారు. -
ఆగస్ట్ 19న వస్తున్న ‘రాజ రాజ చోర’
యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా నటించిన తాజాగా చిత్రం ‘రాజ రాజ చోర’. మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్లు. హితేశ్ గోలి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలో శ్రీవిష్ణు స్మార్ట్ దొంగగా హిలేరియస్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల విడుదలైన ఎంటర్టైనింగ్ టీజర్, పాటలు సహా ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కు ప్రేక్షకాభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాను ఆగస్ట్ 19న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు తెలియజేశారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ హాయిగా నవ్వుకోవాలని, మంచి సినిమాలను చూడాలనుకుంటున్నారు. `రాజ రాజ చోర` ఈ అపరిమితమైన వినోదాన్ని అందించడం ఖాయం అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
శ్రోతల్ని అలరిస్తున్న రాజ రాజు
శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాజ రాజ చోర’. హసిత్ గోలి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ‘రాజా రాజు వచ్చె లోకాలు మెచ్చే..’ అనే పాటను బుధవారం విడుదల చేశారు. ‘దొరలని మీకు మీరు దొర్లుతూ తిరిగారు.. చొరబడి చెడిపోతే చతికిల పడతారు.. రాజా రాజు వచ్చె లోకాలు మెచ్చే..’ అంటూ సాగే ఈ పాటకు వివేక్ సాగర్ ట్యూన్స్ ఇచ్చారు. హసిత్ గోలి సాహిత్యం అందించగా, మోహనా భోగరాజు ఆలపించారు. మేఘా ఆకాష్, సునైన, తనికెళ్ల భరణి, గంగవ్వ, అజయ్ ఘోష్ నటిస్తున్న ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్: కీర్తీ చౌదరి, కో ప్రొడ్యూసర్: వివేక్ కూచిభొట్ల, సంగీతం: వివేక్ సాగర్, కెమెరా: వేదరామన్.