శ్రోతల్ని అలరిస్తున్న రాజ రాజు | Raja Raju Vacche Lyrical Song Out From Raja Raja Chora | Sakshi
Sakshi News home page

Raja Raja Chora Movie:రాజు వచ్చె... లోకాలు మెచ్చె!

Published Thu, Jul 29 2021 3:17 PM | Last Updated on Thu, Jul 29 2021 3:17 PM

Raja Raju Vacche Lyrical Song Out From Raja Raja Chora - Sakshi

శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాజ రాజ చోర’. హసిత్‌ గోలి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ‘రాజా రాజు వచ్చె లోకాలు మెచ్చే..’ అనే పాటను బుధవారం విడుదల చేశారు. ‘దొరలని మీకు మీరు దొర్లుతూ తిరిగారు.. చొరబడి చెడిపోతే చతికిల పడతారు.. రాజా రాజు వచ్చె లోకాలు మెచ్చే..’ అంటూ సాగే ఈ పాటకు వివేక్‌ సాగర్‌ ట్యూన్స్‌ ఇచ్చారు.

హసిత్‌ గోలి సాహిత్యం అందించగా, మోహనా భోగరాజు ఆలపించారు. మేఘా ఆకాష్, సునైన, తనికెళ్ల భరణి, గంగవ్వ, అజయ్‌ ఘోష్‌ నటిస్తున్న ఈ చిత్రానికి క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: కీర్తీ చౌదరి, కో ప్రొడ్యూసర్‌: వివేక్‌ కూచిభొట్ల, సంగీతం: వివేక్‌ సాగర్, కెమెరా: వేదరామన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement