
యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా నటించిన తాజాగా చిత్రం ‘రాజ రాజ చోర’. మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్లు. హితేశ్ గోలి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలో శ్రీవిష్ణు స్మార్ట్ దొంగగా హిలేరియస్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల విడుదలైన ఎంటర్‌టైనింగ్ టీజర్, పాటలు సహా ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కు ప్రేక్షకాభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాను ఆగస్ట్ 19న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు తెలియజేశారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ హాయిగా నవ్వుకోవాలని, మంచి సినిమాలను చూడాలనుకుంటున్నారు. `రాజ రాజ చోర` ఈ అపరిమితమైన వినోదాన్ని అందించడం ఖాయం అని చిత్ర యూనిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment