స్టార్ హీరోల సినిమాలతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండటంతో అటు బాక్సాఫీస్ కూడా బాగానే కలెక్షన్లు దండుకుంటోంది. అయితే థియేటర్లను రఫ్ఫాడించేసిన సినిమాలు ప్రస్తుతం ఓటీటీని షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర అంతంతమాత్రంగానే వసూళ్లు రాబట్టిన చిత్రాలు సైతం ఓటీటీలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఇంతకీ ఈరోజు(మే 20) ఏయే సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయో చూసేయండి..
ఆర్‌ఆర్‌ఆర్
జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటించిన మల్టీస్టారర్ ఆర్‌ఆర్‌ఆర్. డైరెక్టర్ రాజమౌళి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 25న విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సినీవర్గాలనే ఆశ్చర్యంలో ముంచెత్తింది. విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, యాక్టింగ్.. ఇలా అన్ని కోణాల్లో తిరుగులేదు అనిపించిన ఈ చిత్రం తాజాగా జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. మొదట రూ.100 కడితేనే ఈ సినిమా చూడనిస్తామంది జీ 5. ఈ నిర్ణయంపై అభిమానులు భగ్గుమనడంతో వెనక్కు తగ్గిన సదరు ఓటీటీ సంస్థ తమ సబ్‌స్క్రైబర్లు ఉచితంగా చూడవచ్చని తెలిపింది. ఒక్క హిందీ వర్షన్ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
ఆచార్య
చిరంజీవి, రామ్‌చరణ్ నటించిన మల్టీస్టారర్ ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 29న థియేటర్లలో విడుదలైంది. ఓ మోస్తరు కలెక్షన్లతో పర్వాలేదనిపించిన ఈ మూవీ అప్పుడే ఓటీటీలోకి వచ్చేసింది. దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
భళా తందనాన
యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం భళా తందనాన. ‘బాణం’ ఫేమ్ దంతులూరి చైతన్య దర్శకత్వం వహించిన ఈ మూవీలో కేథరిన్ హీరోయిన్‌గా నటించింది. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రంపై రజనీ కొర్రపాటి నిర్మించారు. మే 6న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దీంతో 15 రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో ఈ మూవీ అందుబాటులో ఉంది.
జెర్సీ
నాని నటించిన హిట్ మూవీ జెర్సీ అదే టైటిల్‌తో హిందీలో రీమేక్ అయింది. షాహిద్ కపూర్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ పర్వాలేదనిపించింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 22న థియేటర్లలో రిలీజైంది.
ఇవేకాకుండా 12th మ్యాన్, ఎస్కేప్ లైవ్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతుండగా జాంబీవ్లి జీ5లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరింకెందుకాలస్యం. నచ్చిన సినిమాను ఇప్పుడే వీక్షించేయండి..
చదవండి 👇
Comments
Please login to add a commentAdd a comment