మన్యం విజయ్‌కుమార్, నివేదా థామస్, రామ్, వివేక్ ఆత్రేయ, నారా రోహిత్, శ్రీ విష్ణు
‘‘సినిమా రిలీజైన తర్వాత తెలుస్తుంది.. మనం చిన్న సినిమా చేశామా? పెద్ద సినిమా చేశామా? అని. ‘మెంటల్ మదిలో’ సినిమా చూశా. వివేక్ ఆత్రేయ చాలా బాగా తీశాడు. ఇలాంటి ప్రతిభ ఉన్న డైరెక్టర్‌కి ‘బ్రోచేవారెవరురా’ సినిమాకి మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు కుదిరారు’’ అన్నారు హీరో రామ్. శ్రీవిష్ణు, నివేదా థామస్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. విజయ్ కుమార్ మన్యం నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది.
హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో రామ్ మాట్లాడుతూ– ‘‘నిన్నుకోరి’లో తొలి షాట్ చూసిన తర్వాత నివేదా మంచి నటి అని తెలిసింది. వివేక్ మ్యూజిక్ బావుంటుంది. నా ఫేవరేట్ లిరిసిస్ట్ రామజోగయ్యశాస్త్రి. ‘ఎందుకంటే ప్రేమంట’ సినిమాలో ‘తదుపరి జన్మకైనా...’ పాట రాశారు. ఈ సినిమాకి కూడా మంచి పాటలు రాశారు. శ్రీవిష్ణుని ఫస్ట్ టైమ్ ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ టైమ్‌లో కలిశా. ఆ సినిమాలో నా నటనలో సగం క్రెడిట్ శ్రీవిష్ణుదే. తను చాలా మంచి నటుడు. నాకు నటన నేర్పించిన అరుణ భిక్షుగారు ఈ చిత్రానికి చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు.
శ్రీవిష్ణు మాట్లాడుతూ– ‘‘మంచి సినిమాలు తీయగానే సురేష్ బాబుగారిలాంటి వాళ్లు ఇన్వాల్వ్ అయి సపోర్ట్ చేస్తున్నారు.. ఇందుకు చాలా హ్యాపీ. నేను చిన్నప్పటి నుంచి వెంకటేష్‌గారికి వీరాభిమానిని. ఈ సినిమాలో నేను ఆయన ఫ్యాన్‌గా చేయడం ఆనందంగా ఉంది. ‘బ్రోచేవారెవరురా’ కథని వివేక్ ఆత్రేయ చెప్పినప్పుడు చాలా నచ్చింది. మిత్ర పాత్రలో నివేదా బాగా నటించారు. ఆ పాత్రకోసం, కేవలం మహిళల కోసం ఈ సినిమా చేశా’’ అన్నారు. ‘‘ఈ సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు సురేష్ బాబు. ‘‘మహిళలు చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు నివేదా థామస్. ‘‘విజువల్‌గా సినిమా రిచ్‌గా ఉంటుంది’’ అన్నారు విజయ్ కుమార్ మన్యం. ‘‘ఈ చిత్రం గురించి నేను మాట్లాడటం కన్నా సినిమా చూస్తేనే మంచిది’’ అన్నారు వివేక్ ఆత్రేయ. ‘‘ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నా’’ అన్నారు నారా రోహిత్.
Comments
Please login to add a commentAdd a comment