శ్రీ విష్ణు భళా.. ప్రారంభం | Bhala Thandana movie Schedule Begins | Sakshi
Sakshi News home page

శ్రీ విష్ణు భళా.. ప్రారంభం

Published Wed, Feb 17 2021 12:03 AM | Last Updated on Wed, Feb 17 2021 8:03 AM

Bhala Thandana movie Schedule Begins - Sakshi

వైవిధ్యమైన చిత్రాలు నిర్మించే సాయి కొర్రపాటి తాజాగా ‘భళా తందనాన’ అనే సినిమాకి శ్రీకారం చుట్టారు. శ్రీ విష్ణు హీరోగా ‘బాణం’ దర్శకుడు చైతన్య దంతులూరి దర్శకత్వంలో సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో కేథరిన్‌ కథానాయిక. మంగళవారం జరిగిన ఈ చిత్రం ప్రారంభోత్సవంలో తొలి సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కెమెరా స్విచ్చాన్‌ చేయగా, శ్రీశైల దేవస్థానం మాజీ ప్రధాన సలహాదారు పురాణపండ శ్రీనివాస్‌ క్లాప్‌నిచ్చారు. కీరవాణి సతీమణి శ్రీవల్లి, రాజమౌళి సతీమణి రమా రాజమౌళి స్క్రిప్ట్‌ను చిత్రబృందానికి అందించారు. మార్చిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement