ఏడ ఉన్నావే... | sri vishnu launches pataru palem prema katha song | Sakshi
Sakshi News home page

ఏడ ఉన్నావే...

Published Thu, Nov 28 2019 12:50 AM | Last Updated on Thu, Nov 28 2019 12:50 AM

sri vishnu launches pataru palem prema katha song - Sakshi

శ్రీ విష్ణు, శ్రీ మానస్‌

శ్రీ మానస్, సమ్మోహన జంటగా తెరకెక్కిన చిత్రం ‘పటారుపాళెం ప్రేమ కథ’. జె.ఎస్‌ ఫిలిమ్స్‌ పతాకంపై దొరైరాజు వూపాటి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. బాలు ధాకే స్వరపరచిన ఈ సినిమాలోని ‘ఏడ ఉన్నావే ఏడ ఉన్నావే..’ అనే తొలి పాటను హీరో శ్రీవిష్ణు విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘నన్ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది దొరైరాజుగారే.

ఆయన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పాటను విడుదల చేయడం సంతోషంగా ఉంది. పాట చాలా బాగుంది’’ అన్నారు. దొరైరాజు మాట్లాడుతూ– ‘‘పరువు హత్యల నేపథ్యంలో, కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశాను’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: బాలు ధాకే, సమర్పణ: జిఎస్‌ రెడ్డి, నిర్మాతలు: వి.లతా రెడ్డి, వి. సౌజన్యా దొరైరాజు, బి.ఆర్‌. బాలు, కె. రామకృష్ణ ప్రసాద్‌.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement