వినూత్నమైన కథతో... | Sree Vishnu is next movie announced | Sakshi
Sakshi News home page

వినూత్నమైన కథతో...

Published Thu, Oct 3 2019 12:18 AM | Last Updated on Thu, Oct 3 2019 12:18 AM

 Sree Vishnu is next movie announced - Sakshi

శ్రీవిష్ణు

‘నీదీ నాదీ ఒకే కథ, బ్రోచేవారెవరురా’ ఫేమ్‌ శ్రీవిష్ణు హీరోగా పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ ఓ చిత్రాన్ని నిర్మించనున్నాయి. శ్రీవిష్ణు హీరోగా ‘మెంటల్‌ మదిలో, బ్రోచేవారెవరురా’ వంటి చిత్రాలతో విజయం అందుకున్న డైరెక్టర్‌ వివేక్‌ ఆత్రేయ దగ్గర రచన, దర్శకత్వ విభాగంలో పని చేసిన  హాసిత్‌ గోలి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు.

చిత్రనిర్మాతలు  టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ– ‘‘శ్రీవిష్ణు, హాసిత్‌ గోలి వంటి ప్రతిభ కలిగినవారితో సినిమా నిర్మించనుండటం ఎంతో ఆనందంగా ఉంది. ఒక వినూత్నమైన కథతో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్‌  ఈ ఏడాది చివరిలో ప్రారంభమవుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: వివేక్‌ కూచిభొట్ల, కీర్తీ చౌదరి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement