Abhishek Agarwal To Start Another Sensational Project This Year, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

The Delhi Files: అభిషేక్‌ అగర్వాల్‌ నుంచి ‘ది ఢిల్లీ ఫైల్స్‌ ’ .. రిలీజ్‌ ఎప్పుడంటే?

Published Fri, Apr 26 2024 5:58 PM | Last Updated on Fri, Apr 26 2024 6:24 PM

Abhishek Agarwal Arts The Delhi Files To Start This Year - Sakshi

‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’(2022) సినిమాతో బాలీవుడ్‌లోకి  ప్రవేశించారు తెలుగు నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌. వివేక్‌ రంజన్‌ అగ్నిహోత్రి దర్శకత్వంలో అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌పై రూపొందిన ఈ మూవీ హిట్‌గా నిలిచింది. తాజాగా వివేక్‌ రంజన్‌ అగ్నిహోత్రి డైరెక్షన్‌లోనే ‘ది ఢిల్లీ ఫైల్స్‌’ సినిమా చేయనున్నట్లు అభిషేక్‌ అగర్వాల్‌ చెప్పారు.

తేజ్‌ నారాయణ్‌ అగర్వాల్‌ సమర్పణలో అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌– ఐ యామ్‌ బుద్ధ ప్రొడక్షన్స్‌పై అభిషేక్‌ అగర్వాల్, అర్చన అగర్వాల్, వివేక్‌ రంజన్‌ అగ్నిహోత్రి, పల్లవి జోషి నిర్మించనున్నారు. ‘‘షెడ్యూల్‌ ప్రకారం ‘ది ఢిల్లీ ఫైల్స్‌’ షూటింగ్‌ ఈ ఏడాదిలో ప్రారంభం అవుతుంది.. వచ్చే ఏడాది విడుదలవుతుంది. ఇందులో బిగ్‌ స్టార్లు లేరు.. బిగ్‌ కంటెంట్‌ మాత్రమే ఉంది’’ అని వివేక్‌ అగ్నిహోత్రి అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement