టైగర్ నాగేశ్వరరావు.. స్టూవర్ట్‌పురంలోనే కాదు దేశంలోనే పేరు మోసిన గజదొంగ.. ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు. రవితేజ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీలో నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. రామ్-లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్‌గా పని చేసిన ఈ చిత్రం అక్టోబర్ 20న విడుదల కానుంది.
ఈ క్రమంలో ప్రమోషన్ల స్పీడు పెంచింది చిత్రయూనిట్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. చిత్రీకరణ సమయంలో రవితేజ గాయపడ్డాడని పేర్కొన్నాడు. ట్రైన్ దోపిడీ సీన్‌లో రైలు మీది నుంచి లోపలకు దూకే షాట్‌లో రవితేజ అదుపుతప్పి కిందపడ్డారని తెలిపాడు. ఆ సమయంలో మోకాలికి బాగా దెబ్బ తగలడంతో ఆస్పత్రికి తరలించగా 12 కుట్లు వేసినట్లు పేర్కొన్నాడు.
ఆ షాట్‌లో దాదాపు 400 మంది జూనియర్ ఆర్టిస్టులున్నారని, కావున షూటింగ్‌ను ఎక్కువ రోజులు వాయిదా వేస్తే నిర్మాత నష్టపోతాడని అర్థం చేసుకున్న హీరో రెండు రోజుల్లోనే మళ్లీ షూటింగ్‌కు రెడీ అయిపోయాడని వివరించాడు. విశ్రాంతి తీసుకోవాలని చెప్పినా తను పట్టించుకోలేదని, సినిమాపై ఆయనకున్న అంకితభావానికి ఇది నిదర్శనమని చెప్పుకొచ్చాడు. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్.. రవితేజ ఎంతైనా గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: ఆ వెర్రిపుష్పాన్ని టాస్కులో మడతపెట్టేయాల్సింది.. ఒక్క టాస్క్ పడనీ, చెప్తా..!
Comments
Please login to add a commentAdd a comment