రవితేజ పాన్ ఇండియా కష్టాలు.. చేతిపై బాటిల్ పగలగొట్టి మరీ! | Ravi Teja Tiger Nageswara Rao Movie Hindi Promotions | Sakshi
Sakshi News home page

Ravi Teja: 'టైగర్ నాగేశ్వరరావు' కోసం హీరో రవితేజ అలాంటి రిస్క్!

Published Sat, Oct 14 2023 5:45 PM | Last Updated on Sat, Oct 14 2023 6:21 PM

Ravi Teja Tiger Nageswara Rao Movie Hindi Promotions - Sakshi

రవితేజ సినిమా అంటే మినిమం ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. కానీ గత కొన్నాళ్ల నుంచి ఒక్క హిట్ కొడితే నాలుగు ఫ్లాప్స్ అనేలా ఈ హీరో పరిస్థితి తయారైంది. గతేడాది 'ధమాకా'తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన మాస్ మహారాజా ప్రస్తుతం తొలిసారి పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా కుర్రహీరోలా రిస్కులు కూడా చేస్తున్నాడు.

(ఇదీ చదవండి: ఫ్యాన్స్‌కి 'లియో' షాక్.. అక్కడ టికెట్ రేటు రూ.5 వేలు!)

సినిమా సంగతేంటి?
స్టువర్టుపురం అనే ఊరిలో గజదొంగగా పేరు తెచ్చుకున్న నాగేశ్వరరావు అనే వ్యక్తి బయోపిక్ 'టైగర్ నాగేశ్వరరావు'. ఈ సినిమాలో రవితేజ హీరో కావడం, ట్రైలర్ కూడా డిఫరెంట్‌గా ఉండటంతో ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. వచ్చే వారం దసరా కానుకగా ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. అయితే తెలుగు కంటే ఉత్తరాదిలో ప్రస్తుతం ప్రమోషన్స్‌తో రవితేజ ఫుల్ బిజీగా ఉన్నాడు.

బాటిల్ పగిలింది
తాజాగా ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమయ్యే ఓ డ్యాన్స్ షోలో రవితేజ పాల్గొన్నాడు. అయితే డ్యాన్సులు చూసి, స్టెప్పులేసి వెళ్లిపోకుండా చిన్నపాటి రిస్క్ చేశాడు. సందర్భం కరెక్ట్‌గా తెలియనప్పటికీ బీర్ బాటిల్‌ని తన చేతిపై పగలగొట్టుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది. అలానే అదే షోకి జడ్జిగా ఉన్న శిల్పాశెట్టితో కలిసి డ్యాన్స్ కూడా చేశాడు. 

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ చరిత్రలోనే తొలిసారి.. కంటెస్టెంట్ల చేతికి మొబైల్‌ ఫోన్స్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement