టైగర్‌ నాగేశ్వరరావు మూవీలో గాయత్రి భరద్వాజ్‌ | Tiger Nageswara Rao: Gayatri Bharadwaj Acts With Ravi Teja | Sakshi
Sakshi News home page

Tiger Nageswara Rao: రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్లు

Published Fri, Apr 1 2022 2:22 PM | Last Updated on Fri, Apr 1 2022 3:02 PM

Tiger Nageswara Rao: Gayatri Bharadwaj Acts With Ravi Teja - Sakshi

మాస్‌ మహారాజ రవితేజ నటిస్తున్న పాన్‌ ఇండియా మూవీ 'టైగర్‌ నాగేశ్వరరావు'. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో కృతీ సనన్‌ సోదరి నుపూర్‌ సనన్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసిన చిత్రయూనిట్‌ తాజాగా మరో హీరోయిన్‌ను సైతం సెలక్ట్‌ చేసింది.

ఇండియన్‌ మోడల్‌, నటి గాయత్రి భరద్వాజ్‌ కూడా ఇందులో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నాడు. కాగా రవితేజ ప్రస్తుతం ధమాకా, రావణాసుర చిత్రాల షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ మాస్‌ హీరో నటించిన రామారావు ఆన్‌ డ్యూటీ త్వరలోనే విడుదల కానుంది.

చదవండి: డేటింగ్‌ రూమర్స్‌పై ‍స్పందించిన నాగిని బ్యూటీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement