అరకులో గాలి సంపత్‌ | Gaali Sampath Shoot Is Progressing At Araku | Sakshi
Sakshi News home page

అరకులో గాలి సంపత్‌

Published Sun, Nov 29 2020 12:29 AM | Last Updated on Sun, Nov 29 2020 12:29 AM

Gaali Sampath Shoot Is Progressing At Araku - Sakshi

శ్రీ విష్ణు

శ్రీ విష్ణు, లవ్‌లీ సింగ్‌ హీరోహీరోయిన్లుగా, డా. రాజేంద్ర ప్రసాద్‌ గాలి సంపత్‌గా టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న చిత్రం ‘గాలి సంపత్‌’. అనీష్‌ దర్శకత్వంలో  డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి సమర్పిస్తూ, స్క్రీన్‌ ప్లే అందిస్తున్నారు. సాహు గారపాటి, హరీష్‌ పెద్దిలతో కలిసి ఎస్‌. క్రిష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం అరకులో జరుగుతోంది. ‘‘తండ్రీ కొడుకుల మధ్య ముందెన్నడూ చూడని ఒక వైవిధ్యమైన భావోద్వేగంతో రూపొందుతోన్న చిత్రమిది.

అనిల్‌ రావిపూడి మార్క్‌ వినోదంతో అందమైన ప్రయాణంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం అరకులో రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణుతో పాటు ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌ డిసెంబర్‌ 5 వరకు జరుగుతుంది. ఆ తర్వాత హైదరాబాద్‌లో షెడ్యూల్‌ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరామ్, సంగీతం: అచ్చు రాజమణి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: నాగమోహన్‌ బాబు. ఎమ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement