‘‘పోలీస్ స్టోరీగా తెరకెక్కిన చిత్రం ‘అల్లూరి’. ఫిక్షనల్ పాత్ర తీసుకొని వాస్తవ ఘటనలతో రూపొందించాం. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది.. చాలామందిలో స్ఫూర్తి నింపుతుంది’’ అని హీరో శ్రీ విష్ణు అన్నారు. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో శ్రీ విష్ణు, కయదు లోహర్ జంటగా నటించిన చిత్రం ‘అల్లూరి’. బెక్కెం బబిత సమర్పణలో బెక్కెం వేణు గోపాల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న రిలీజవుతోంది. ఈ సందర్భంగా శ్రీ విష్ణు పంచుకున్న విశేషాలు...
⇔ ‘అల్లూరి’ కథ చెప్పే ముందు ప్రదీప్ ఇందులో నాది పోలీస్ పాత్ర అంటే లైట్ తీసుకున్నాను. కానీ, కథ విన్నాక చేయాలనిపించింది. ఎలాంటి పరిస్థితిలోనైనా నిజాయితీగా ఉంటూ విధిని నిర్వహించే ఓ పోలీస్ కథ ఇది. వ్యవస్థలోని మంచి చెడుల్ని చూపించాం. చెడుకి పరిష్కారం కూడా చెప్పాం.
⇔ కృష్ణగారి సినిమా ‘అల్లూరి సీతారామరాజు’ క్లయిమాక్స్‌లో ‘ఒక అల్లూరి చనిపోతే వందమంది అల్లూరిలు పుడతారు’ అనే డైలాగ్ ఉంది. ఆ వందమందిలో మా ‘అల్లూరి’ ఒకరు (నవ్వుతూ).
⇔ పక్కింటి అబ్బాయిలా కంఫర్ట్ జోన్‌లో ఉంటే కొంత కాలానికి బోర్ కొట్టేస్తుంది. అందుకే అలా ఉండిపోదలచుకోలేదు. విభిన్నమైన పాత్రలు చేయాలని కొత్త ప్రయత్నాలు చేస్తుంటాను. అయితే మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలనే ఉద్దేశం లేదు.
⇔ ‘అల్లూరి’కి కొత్త ఆడియన్స్ కావాలి. దీనికి నా ఒక్కడి బలం సరిపోదు. అందుకే అల్లు అర్జున్‌గారిని మా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి పిలిచాను. మాకు సపోర్ట్ చేసిన బన్నీ, నాని, రవితేజగార్లకు థ్యాంక్స్. నిజానికి ఏఏ (అల్లు అర్జున్) సెంటిమెంట్ నాకు కలిసొచి్చంది. ‘అల్లూరిలో ‘అల్లు’ రావడం ఇంకా హ్యాపీ (నవ్వుతూ).
⇔ రానున్న రెండేళ్లలో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాను. దర్శకుడు మన తెలుగువాడే. స్క్రిప్ట్ వర్క్ జరుగు తోంది. ప్రస్తుతం హాసిత్, సాయి, హర్ష దర్శకత్వాల్లో సినిమాలు చేస్తున్నాను.
Sri Vishnu: ఫస్ట్ పోలీస్ పాత్ర అనగానే లైట్ తీసుకున్న: శ్రీ విష్ణు
Published Wed, Sep 21 2022 8:55 AM | Last Updated on Wed, Sep 21 2022 4:41 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment