Alluri Movie
-
ఓటీటీలోకి వచ్చేస్తున్న 'అల్లూరి'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
శ్రీ విష్ణు, కయదు లోహర్ జంటగా ప్రదీప్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల్లూరి’. బెక్కెం బబిత సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. సెప్టెంబర్ 7న రాత్రి ఎనిమిది గంటల నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ చిత్రం విడుదలైన రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీ విష్ణు ఈ సినిమాలో నటించారు. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, రాజా రవింద్ర, పృథ్వీరాజ్, సుమన్, జయవాణి, మధుసుధననరావు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తన్నారు. థియేటర్లలో ఈ సినిమా మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. Alluri. Athaniki oka style undi. Case ni handle chese vidhananiki oka meter undi. Okkasari bari loki digithe, raccha ne🔥#AlluriOnAHA Premieres tomorrow @ 8pm @sreevishnuoffl pic.twitter.com/ju1qu9rEmQ — ahavideoin (@ahavideoIN) October 6, 2022 -
‘అల్లూరి’ మార్నింగ్ షో రద్దు.. ఇక మీ చేతుల్లోనే అంటూ శ్రీవిష్ణు ట్వీట్
శ్రీ విష్ణు, కయదు లోహర్ జంటగా ప్రదీప్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల్లూరి’. బెక్కెం బబిత సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమా నేడు(సెప్టెంబర్ 23)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అనుకోని కారణాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ మార్నింగ్ షో రద్దు చేశారు. మాట్నీ షో నుంచి ఈ చిత్రం థియేటర్స్‌లో ప్రదర్శించబడుతుంది. ఈ విషయాన్ని శ్రీవిష్ణు ట్వీటర్ వేదికగా తెలియజేశాడు. ‘కొన్ని కారణాల వల్ల ‘అల్లూరి’ మార్నింగ్ షోలను మీ ముందుకు తీసుకురాలేకపోయాం. మ్యాట్నీ నుంచి మీదే.. ఇక మీ చేతుల్లోనే’ అని శ్రీవిష్ణు ట్వీట్ చేశాడు. మార్నింగ్ షో రద్దు కావడంపై పలువురు సినీ ప్రియులు, శ్రీవిష్ణు అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సమస్యల కారణంగా ఈ సినిమా ఆగినట్లు తెలుస్తుంది. నిర్మాతకు, ఫైనాన్సియర్స్‌కి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. నిర్మాత ముందడుగు వేసి ఫైనాన్సియర్స్‌తో డీల్ చేసుకోవడంతో మాట్నీ షో నుంచి ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలైంది. పోలీస్ వ్యవస్థ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో శ్రీవిష్ణు పోలీసు అధికారి పాత్రను పోషించాడు. Due to some issues, we couldn’t bring in the #Alluri morning shows! Matinees nunchi meedhe . Ika mi chethilone 🙏 Enjoy #ALLURI at your nearest cinemas ❤️#AlluriFromToday pic.twitter.com/SnX5pdskcB — Sree Vishnu (@sreevishnuoffl) September 23, 2022 -
‘అల్లూరి’ ఫిక్షనల్ పాత్ర తీసుకొని వాస్తవ ఘటనలతో రూపొందించాం : శ్రీ విష్ణు
-
ఫస్ట్ పోలీస్ పాత్ర అనగానే లైట్ తీసుకున్న: శ్రీ విష్ణు
‘‘పోలీస్ స్టోరీగా తెరకెక్కిన చిత్రం ‘అల్లూరి’. ఫిక్షనల్ పాత్ర తీసుకొని వాస్తవ ఘటనలతో రూపొందించాం. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది.. చాలామందిలో స్ఫూర్తి నింపుతుంది’’ అని హీరో శ్రీ విష్ణు అన్నారు. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో శ్రీ విష్ణు, కయదు లోహర్ జంటగా నటించిన చిత్రం ‘అల్లూరి’. బెక్కెం బబిత సమర్పణలో బెక్కెం వేణు గోపాల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న రిలీజవుతోంది. ఈ సందర్భంగా శ్రీ విష్ణు పంచుకున్న విశేషాలు... ⇔ ‘అల్లూరి’ కథ చెప్పే ముందు ప్రదీప్ ఇందులో నాది పోలీస్ పాత్ర అంటే లైట్ తీసుకున్నాను. కానీ, కథ విన్నాక చేయాలనిపించింది. ఎలాంటి పరిస్థితిలోనైనా నిజాయితీగా ఉంటూ విధిని నిర్వహించే ఓ పోలీస్ కథ ఇది. వ్యవస్థలోని మంచి చెడుల్ని చూపించాం. చెడుకి పరిష్కారం కూడా చెప్పాం. ⇔ కృష్ణగారి సినిమా ‘అల్లూరి సీతారామరాజు’ క్లయిమాక్స్‌లో ‘ఒక అల్లూరి చనిపోతే వందమంది అల్లూరిలు పుడతారు’ అనే డైలాగ్ ఉంది. ఆ వందమందిలో మా ‘అల్లూరి’ ఒకరు (నవ్వుతూ). ⇔ పక్కింటి అబ్బాయిలా కంఫర్ట్ జోన్లో ఉంటే కొంత కాలానికి బోర్ కొట్టేస్తుంది. అందుకే అలా ఉండిపోదలచుకోలేదు. విభిన్నమైన పాత్రలు చేయాలని కొత్త ప్రయత్నాలు చేస్తుంటాను. అయితే మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలనే ఉద్దేశం లేదు. ⇔ ‘అల్లూరి’కి కొత్త ఆడియన్స్ కావాలి. దీనికి నా ఒక్కడి బలం సరిపోదు. అందుకే అల్లు అర్జున్‌గారిని మా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి పిలిచాను. మాకు సపోర్ట్ చేసిన బన్నీ, నాని, రవితేజగార్లకు థ్యాంక్స్. నిజానికి ఏఏ (అల్లు అర్జున్) సెంటిమెంట్ నాకు కలిసొచి్చంది. ‘అల్లూరిలో ‘అల్లు’ రావడం ఇంకా హ్యాపీ (నవ్వుతూ). ⇔ రానున్న రెండేళ్లలో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాను. దర్శకుడు మన తెలుగువాడే. స్క్రిప్ట్ వర్క్ జరుగు తోంది. ప్రస్తుతం హాసిత్, సాయి, హర్ష దర్శకత్వాల్లో సినిమాలు చేస్తున్నాను. -
‘అల్లూరి’ ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు అర్జున్ (ఫొటోలు)
-
అదే ఇప్పుడున్న ట్రెండ్: అల్లు అర్జున్
‘‘చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అన్నది కాదు. ఇప్పుడున్న ట్రెండ్ ఒక్కటే.. మంచి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంటే థియేటర్స్‌కు వస్తున్నారు. ‘అల్లూరి’ సినిమా విజయం సాధించాలి’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. శ్రీ విష్ణు హీరోగా ప్రదీప్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అల్లూరి’. కయదు లోహర్ కథానాయికగా నటించారు. బెక్కెం బబిత సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ ‘నారాయనుడయ్యేను నవ వరుడు..’ అనే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘నాకు ఇష్టమైన వ్యక్తి శ్రీవిష్ణు. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాలో తన నటన నచ్చడంతో పిలిచి మాట్లాడాను. ప్రతి సినిమాకు అంకితభావంతో పనిచేసే శ్రీవిష్ణు అంటే నాకు ఇష్టం.. గౌరవం కూడా. యాక్టర్‌గా తను ఇంకా పైకి ఎదగాలి’’ అన్నారు. శ్రీ విష్ణు మాట్లాడుతూ– ‘‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమా తర్వాత బన్నీగారు నన్ను పిలిచి, ‘భవిష్యత్‌లో కంటెంట్ ఉన్న సినిమాలే ఆడతాయి. సో... కంటెంట్ ఉన్న చిత్రాల్లో నటించు.. లేకపోతే ఖాళీగా ఉండు’ అంటూ ఓ ముందు చూపుతో చెప్పారు. అవసరమైతే నా సినిమాని నిర్మిస్తానని భరోసా ఇచ్చారు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో నేను ఓ చిన్న రోల్ చేశాను. ఆ తర్వాత నేను కేరళ వెళ్లినప్పుడు బన్నీగారి ఫ్యాన్స్ నన్ను గుర్తుపట్టి మాట్లాడారు. బన్నీగారు టాలీవుడ్లో చేస్తే చాలు అది ప్యాన్ ఇండియా సినిమా అయిపోతుంది. ‘అల్లూరి’ చిత్రం పోలీస్ స్టోరీ. మా మూవీ చూసిన తర్వాత పోలీసు కనిపిస్తే సెల్యూట్ చేస్తారు’’ అన్నారు. ‘‘పోలీసు అంటే ఒక వ్యక్తి కాదు.. పోలీస్ అంటే ఒక వ్యవస్థ’ అనే డైలాగ్ ఆధారంగా ఈ సినిమా కథ రాసుకున్నాను’’ అన్నారు ప్రదీప్ వర్మ. ‘‘ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు బెక్కెం వేణుగోపాల్. ఈ కార్యక్రమంలో బెక్కెం బబిత, సహ నిర్మాతలు నాగార్జున, గంజి రమ్య, విజయలక్ష్షి్మ, మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్, సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట, దర్శకులు ప్రశాంత్ వర్మ, హర్ష, తేజ మార్ని, నటుడు తనికెళ్ల భరణి పాల్గొన్నారు. -
ఆయనలా శ్రీ విష్ణు పెద్ద స్టార్ అవ్వాలి: నాని
‘‘మహేశ్‌బాబుగారు బయట చాలా రిజర్వ్డ్గా ఉండి లోపల చాలా సరదాగా ఉంటారని విన్నాను. ఆయన తర్వాత శ్రీ విష్ణు ఆ కోవకి వస్తారు. తను కూడా మహేశ్గారిలా పెద్ద స్టార్ కావాలి’’ అని హీరో నాని అన్నారు. శ్రీ విష్ణు, కయదు లోహర్ జంటగా ప్రదీప్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల్లూరి’. బెక్కెం బబిత సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను నాని విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘అల్లూరి’ ట్రైలర్ బావుంది.. సినిమా పెద్ద సక్సెస్ కావాలి. సినిమా చేస్తే హీరో కాకుండా పాత్రలు మాత్రమే కనిపించే హీరోలు చాలా తక్కువమంది ఉంటారు.. అలాంటి నటుల్లో ముందు వరుసలో ఉండే శ్రీ విష్ణు అంటే నాకు చాలా ఇష్టం’’ అన్నారు. ‘‘ఎంతోమంది నానీగారిని స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీకి వస్తారు.. నాకు కూడా ఆయనే స్ఫూర్తి. గొప్ప కథతో రూపొందిన ‘అల్లూరి’ చిత్రాన్ని ఆదరించాలి’’ అన్నారు శ్రీ విష్ణు. ‘‘అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమా ‘అల్లూరి’. ట్రైలర్ అందరికీ నచ్చింది.. సినిమా అంతకంటే పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు బెక్కెం వేణుగోపాల్. గేయ రచయిత రాంబాబు గోసాల పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నాగార్జున వడ్డే, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, కెమెరా: రాజ్ తోట.