Sree Vishnu Tweet On Alluri Movie Morning Show Cancelled Issue - Sakshi
Sakshi News home page

Sree Vishnu: ‘అల్లూరి’ మార్నింగ్‌ షో రద్దు.. ఇక మీ చేతుల్లోనే అంటూ శ్రీవిష్ణు ట్వీట్‌

Published Fri, Sep 23 2022 3:04 PM | Last Updated on Fri, Sep 23 2022 5:37 PM

Sree Vishnu Tweet On Alluri Movie Morning Show Cancelled Issue - Sakshi

శ్రీ విష్ణు, కయదు లోహర్‌ జంటగా ప్రదీప్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల్లూరి’. బెక్కెం బబిత సమర్పణలో బెక్కెం వేణుగోపాల్‌ నిర్మించిన ఈ సినిమా నేడు(సెప్టెంబర్‌ 23)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అనుకోని కారణాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ మార్నింగ్‌ షో రద్దు చేశారు. మాట్నీ షో నుంచి ఈ చిత్రం థియేటర్స్‌లో ప్రదర్శించబడుతుంది. ఈ విషయాన్ని శ్రీవిష్ణు ట్వీటర్‌ వేదికగా తెలియజేశాడు. ‘కొన్ని కారణాల వల్ల ‘అల్లూరి’ మార్నింగ్‌ షోలను మీ ముందుకు తీసుకురాలేకపోయాం. మ్యాట్నీ నుంచి మీదే.. ఇక మీ చేతుల్లోనే’ అని శ్రీవిష్ణు ట్వీట్‌ చేశాడు.

మార్నింగ్‌ షో రద్దు కావడంపై పలువురు సినీ ప్రియులు, శ్రీవిష్ణు అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సమస్యల కారణంగా ఈ సినిమా ఆగినట్లు తెలుస్తుంది. నిర్మాతకు, ఫైనాన్సియర్స్‌కి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. నిర్మాత ముందడుగు వేసి ఫైనాన్సియర్స్‌తో డీల్ చేసుకోవడంతో మాట్నీ షో నుంచి ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలైంది.  పోలీస్‌ వ్యవస్థ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో శ్రీవిష్ణు పోలీసు అధికారి పాత్రను పోషించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement