
వైవిధ్యభరిత చిత్రాలు తీస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు యండ్ హీరో శ్రీవిష్ణు. ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడతాడు. ఇప్పటికే ‘గాలి సంపత్’ అనే వెరైటీ చిత్రం చేస్తున్న ఈ యువ హీరో..తాజాగా మరో ఆసక్తికర కాన్సెప్ట్‌తో కొత్త సినిమాను ప్రకటించారు. ఫేమ్ తేజ మర్ని దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోన్న చిత్రానికి ఆదివారం 'అర్జున ఫల్గుణ' అనే టైటిల్‌ని ఖరారు చేశారు.
టైటిల్ పోస్టర్‌లో ఐదుగురు వ్యక్తులు పరుగులు పెడుతుంటే, వారిని ఓ పోలీస్ జీప్ వెంటాడుతోంది. పైన వ్యక్తుల ముఖాలు మాత్రం కనిపించడం లేదు. కానీ వారు పరుగెత్తుతుండగా, పక్కనే ఉన్న కాలవలో వారి ప్రతిబింబాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రతిబింబాలు ఎవరివో వెల్లడవుతున్నాయి. హీరో హీరోయిన్లు, వారి ముగ్గురు ఫ్రెండ్స్.. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి పారిపోతున్నారని ఆ పోస్టర్ తెలియజేస్తోంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. ఇప్పటికే 75% షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో.. శ్రీ విష్ణు సరసన బ్యూటీ ఫుల్ హీరోయిన్ అమృత అయ్యర్ నటిస్తోంది. ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment