కన్‌ఫ్యూజన్‌ కుర్రాడు! | Mental Madhilo new look poster released | Sakshi
Sakshi News home page

కన్‌ఫ్యూజన్‌ కుర్రాడు!

Published Sun, Sep 10 2017 1:30 AM | Last Updated on Sun, Sep 17 2017 6:39 PM

కన్‌ఫ్యూజన్‌ కుర్రాడు!

కన్‌ఫ్యూజన్‌ కుర్రాడు!

శ్రీవిష్ణు, నివేతా పేతురాజ్‌ జంటగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రాజ్‌ కందుకూరి నిర్మించిన చిత్రం ‘మెంటల్‌ మదిలో’. ప్రశాంత్‌ విహారి స్వరకర్త. ఈ చిత్రాన్ని సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో విడుదల చేయనున్నారు. శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ చిత్రం పోస్టర్‌ను నిర్మాత డి. సురేశ్‌బాబు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో అందరూ యంగ్‌స్టర్స్‌ ఉన్నారు. అది బాగా నచ్చింది. సినిమా తీయాలనే కల చాలామందికి ఉంటుంది. వీరందరూ మంచి సినిమా తీశారు’’ అన్నారు. రాజ్‌కందుకూరి మాట్లాడుతూ– ‘‘చిన్నసినిమా ప్రేక్షకులకు చేరువ కావాలంటే మంచి సపోర్టింగ్‌ సిస్టమ్‌ ఉండాలి.

సురేశ్‌బాబుగారు సినిమా చూసి, ఇచ్చిన సలహాను దర్శకుడు వివేక్‌ ఆత్రేయ పాటించారు. ఇందులో హీరో ఇంట్రావర్ట్‌ అండ్‌ కన్‌ఫ్యూజ్డ్‌ షై పర్సన్‌. అలాంటి వ్యక్తి కన్‌ఫ్యూజ్‌ వల్ల ఏం కోల్పోయాడు? అన్నది డైరెక్టర్‌ బాగా చూపించారు. సురేశ్‌బాబు సినిమా చూసి బాగుంది అన్నప్పుడు సగం సక్సెస్‌ వచ్చిందని భావించాం’’ అన్నారు. ‘‘సురేశ్‌బాబుగారిని హెడ్‌మాస్టార్‌లా చూస్తుంటాను’’ అన్నారు ‘మధుర’ శ్రీధర్‌. ‘‘నేను డైరెక్ట్‌ చేసిన సినిమాను సురేశ్‌బాబుగారు ప్రజెంట్‌ చేయడం అనేది గొప్ప విషయం. ఆయనకు థ్యాంక్స్‌. ‘పెళ్లి చూపులు’ వంటి హిట్‌ తర్వాత రాజ్‌ కందుకూరి నాతో సినిమా చేయడంతో ఆయన కాస్త రిస్క్‌ తీసుకునే వ్యక్తని భావిస్తున్నాను’’ అన్నారు దర్శకుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement