Mental Madhilo
-
'మెంటల్ మదిలో...' మూవీ రివ్యూ
టైటిల్ : మెంటల్ మదిలో... జానర్ : రొమాంటిక్ ఎంటర్ టైనర్ తారాగణం : శ్రీ విష్ణు, నివేథ పెతురాజ్, శివాజీ రాజా సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి దర్శకత్వం : వివేక్ ఆత్రేయ నిర్మాత : రాజ్ కందుకూరి పెళ్లిచూపులు సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న నిర్మాత రాజ్ కందుకూరి మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ శ్రీ విష్ణు హీరోగా మెంటల్ మదిలో సినిమాను తెరకెక్కించారు. సపోర్టింగ్ రోల్స్ లో మంచి ఇమేజ్ సంపాదించిన శ్రీ విష్ణు, అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో నటుడిగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమాతో హీరోగా తొలి విజయాన్ని అందుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు సోలో హీరోగా మెంటల్ మదిలో సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. సినిమాలోని కంటెంట్ నచ్చిన సురేష్ బాబు.. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ తొలిసారిగా డైరెక్ట్ చేసిన మెంటల్ మదిలో.. మరోసారి రాజ్ కందుకూరికి సక్సెస్ అందించిందా? శ్రీవిష్ణు సోలో హీరోగా ఆకట్టుకున్నాడా..? కథ : అరవింద్ కృష్ణ (శ్రీ విష్ణు) ఏ విషయంలోనూ సొంతంగా నిర్ణయం తీసుకోలేని గందరగోళ మనస్తత్వం కలిగిన వ్యక్తి. కనీసం ఏ షర్ట్ వేసుకోవాలో కూడా సొంతంగా నిర్ణయం తీసుకోలేడు. అందుకే చిన్నప్పటి నుంచి ఏ విషయంలోనూ ఆప్షన్స్ తీసుకోవడానికి ఇష్టపడడు. అంతేకాదు చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన కారణంగా అమ్మాయిలంటే కూడా అరవింద్ కు భయం కలుగుతుంది. చదువు పూర్తయి ఉద్యోగంలో చేరినా అమ్మాయిలతో మాత్రం మాట్లాడడు. పెళ్లి చేస్తే ఏమైన మార్పు వస్తుందని భావించిన అరవింద్ తల్లిదండ్రులు సంబంధాలు చూస్తుంటారు. (సాక్షి రివ్యూస్)డజనుకు పైగా పెళ్లిచూపులు చూసినా అరవింద్ ప్రవర్తన కారణంగా ఒక్కటి కూడా సెట్ కాదు. చివరకు స్వేచ్ఛ (నివేథ పెతురాజ్), అరవింద్ తో పెళ్లికి ఓకె చెపుతుంది. అరవింద్ కూడా తొలి చూపులోనే స్వేచ్ఛతో ప్రేమలో పడతాడు. తనతో పరిచయం అయిన తరువాత అరవింద్ ప్రవర్తనలో చాలా మార్పు వస్తుంది. అనుకోని పరిస్థితుల్లో వీరి ఎంగేజ్ మెంట్ వాయిదా పడుతుంది. అదే సమయంలో అరవింద్ ఆఫీస్ పనిమీద ముంబై వెళ్లాల్సి వస్తుంది. అయిష్టంగానే ముంబై వెళ్లిన అరవింద్, కొద్ది రోజులు తరువాత స్వేచ్ఛకు ఫోన్ చేసి ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకుందాం అని చెప్తాడు. అరవింద్ ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి..? ముంబైలో ఏం జరిగింది..? చివరకు అరవింద్, స్వేచ్ఛలు ఒక్కటయ్యారా అన్నదే మిగతా కథ. నటీనటులు : అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలో సీరియస్ రోల్ లో కనిపించిన శ్రీ విష్ణు, మెంటల్ మదిలో లవర్ బాయ్ లుక్స్ లో అదరగొట్టాడు. సొంతంగా నిర్ణయం తీసుకోలేని గందరగోళ మనస్తత్వం ఉన్న వ్యక్తిగా మంచి నటన కనబరిచాడు. ఫస్ట్ హాఫ్ అంతా అమాయకుడిగా కనిపించిన శ్రీవిష్ణు, సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్స్ తో ఆకట్టుకున్నాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ హీరోయిన్ గా నటించిన నివేథ పెతురాజ్, లుక్స్ తో పాటు నటనతోను స్వేచ్ఛపాత్రకు ప్రాణం పోసింది నివేథ. (సాక్షి రివ్యూస్)మరో కీలక పాత్రలో నటించిన రేణు, కథను మలుపు తిప్పే పాత్రలో ఆకట్టుకుంది. బబ్లీగా కనిపిస్తూనే మంచి ఎమోషన్స్ పండించింది. చాలా కాలం తరువాత ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించిని సీనియర్ నటుడు శివాజీ రాజా మిడిల్ క్లాస్ తండ్రిగా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : పెళ్లిచూపులు లాంటి క్లాస్ ఎంటర్ టైనర్ తో ఆకట్టుకున్న రాజ్ కందుకూరి మరోసారి అలాంటి అందమైన ప్రేమకథను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఏ నిర్ణయం తీసుకోలేని వ్యక్తి, తన సమస్య కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, ప్రేమ విషయంలో ఎలాంటి మానసిక సంఘర్షణకు గురయ్యాడో ఎంటర్ టైనింగ్ గా చూపించారు. తొలి సినిమానే అయినా.. దర్శకుడు వివేక్ ఆత్రేయ కథను చాలా బాగా డీల్ చేశాడు. కథనంలో కాస్త వేగం తగ్గినా ఓ అందమైన ప్రేమకథను చూస్తున్న ఫీల్ కలిగించటంలో సక్సెస్ సాధించాడు. ముఖ్యంగా దర్శకుడు ఎంచుకున్న టీం సినిమా అంత బాగా రావడానికి హెల్ప్ అయ్యింది. (సాక్షి రివ్యూస్) తొలి చిత్రమే అయినా సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్ విహారి తన మార్క్ చూపించాడు. మనసును తాకే మెలోడీస్ తో పాటు అద్భుతమైన నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచాడు. కమర్షియల్ మూసలో కాకుండా ఇలాంటి డిఫరెంట్ సినిమాలను ఎంచుకుంటున్న రాజ్ కందుకూరి ప్రయత్నాన్ని సినీ ప్రముఖులు అభినందిస్తున్నారు. కథ ఎంపికలో ఆయన చూపిస్తున్న కొత్తదనం ఎంతో మంది కొత్త సాంకేతిక నిపుణులకు ప్రొత్సాహాన్ని ఇస్తుందంటున్నారు. - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
మౌత్ పబ్లిసిటీ ఇవ్వండి చాలు!
శ్రీ విష్ణు, నివేతా పెతురాజ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై రాజ్ కందుకూరి నిర్మించిన సినిమా ‘మెంటల్ మదిలో’. ప్రముఖ నిర్మాత డి. సురేశ్‌బాబు చిత్రసమర్పకులు. ఈ నెల 24న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సినిమాలోని నాలుగో పాట ‘ఏదేలా ఏదోలా’ను విడుదల చేసిన డి. సురేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘చాలా మంది తమ సినిమా బాగుంది చూడమని ప్రెస్‌మీట్స్‌లో చెప్తుంటారు. మా సినిమా ప్రివ్యూలు వేస్తాం. చూడండి... నచ్చితే మౌత్ పబ్లిసిటీ ఇవ్వండి. మాకది చాలు’’అన్నారు. ‘‘కన్ఫ్యూజన్లో ఉన్న ఓ అబ్బాయి కథే ఈ సినిమా. సురేశ్‌బాబుగారికి నచ్చడంతో విడుదల చేయాడానికి ముందుకొచ్చారు. ఈ నెల 20న ప్రీ–రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నాం. శ్రీవిష్ణు, నివేతా బాగా నటించారు. వివేక్ సినిమాను చక్కగా తెరకెక్కించాడు. ప్రశాంత్ మంచి పాటలు అందించారు’’ అన్నారు రాజ్ కందుకూరి. ‘‘యంగ్ అండ్ ఫ్రెష్ టీమ్ కలిసి పని చేసిన సినిమా ఇది. సురేశ్‌బాబుగారు అండగా నిలవడం ఆనందంగా ఉంది’’ అన్నారు శ్రీవిష్ణు. చిత్రదర్శకుడు వివేక్, హీరోయిన్ నివేతా పేతురాజ్, నటుడు కిరిటీ దామరాజు, సంగీత దర్శకుడు ప్రశాంత్ పాల్గొన్నారు. -
కన్ఫ్యూజన్ కుర్రాడు!
శ్రీవిష్ణు, నివేతా పేతురాజ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రాజ్ కందుకూరి నిర్మించిన చిత్రం ‘మెంటల్ మదిలో’. ప్రశాంత్ విహారి స్వరకర్త. ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో విడుదల చేయనున్నారు. శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ చిత్రం పోస్టర్‌ను నిర్మాత డి. సురేశ్‌బాబు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో అందరూ యంగ్‌స్టర్స్ ఉన్నారు. అది బాగా నచ్చింది. సినిమా తీయాలనే కల చాలామందికి ఉంటుంది. వీరందరూ మంచి సినిమా తీశారు’’ అన్నారు. రాజ్‌కందుకూరి మాట్లాడుతూ– ‘‘చిన్నసినిమా ప్రేక్షకులకు చేరువ కావాలంటే మంచి సపోర్టింగ్ సిస్టమ్ ఉండాలి. సురేశ్‌బాబుగారు సినిమా చూసి, ఇచ్చిన సలహాను దర్శకుడు వివేక్ ఆత్రేయ పాటించారు. ఇందులో హీరో ఇంట్రావర్ట్ అండ్ కన్ఫ్యూజ్డ్ షై పర్సన్. అలాంటి వ్యక్తి కన్ఫ్యూజ్ వల్ల ఏం కోల్పోయాడు? అన్నది డైరెక్టర్ బాగా చూపించారు. సురేశ్‌బాబు సినిమా చూసి బాగుంది అన్నప్పుడు సగం సక్సెస్ వచ్చిందని భావించాం’’ అన్నారు. ‘‘సురేశ్‌బాబుగారిని హెడ్మాస్టార్లా చూస్తుంటాను’’ అన్నారు ‘మధుర’ శ్రీధర్. ‘‘నేను డైరెక్ట్ చేసిన సినిమాను సురేశ్‌బాబుగారు ప్రజెంట్ చేయడం అనేది గొప్ప విషయం. ఆయనకు థ్యాంక్స్. ‘పెళ్లి చూపులు’ వంటి హిట్ తర్వాత రాజ్ కందుకూరి నాతో సినిమా చేయడంతో ఆయన కాస్త రిస్క్ తీసుకునే వ్యక్తని భావిస్తున్నాను’’ అన్నారు దర్శకుడు. -
సురేష్ బాబు చేతికి మెంటల్ మదిలో..
గత ఏడాది పెళ్లిచూపులు సినిమాతో ఘనవిజయం సాధించిన రాజ్ కందుకూరి నిర్మాణంలో తెరకెక్కుతున్న మరో మూవీ మెంటల్ మదిలో... అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు ఈ సినిమాతో మరోసారి ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. న్యూ ఏజ్ యూత్ ఫుల్ రోమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నివేతా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాజ్ కందుకూరి నిర్మించిన పెళ్లి చూపులు సినిమా రైట్స్ తీసుకున్న స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, మెంటల్ మదిలో సినిమా రైట్స్ కూడా సొంతం చేసుకోవటం విశేషం. ఇటీవల చిత్రయూనిట్ తో కలిసి మెంటల్ మదిలో ఫస్ట్ కాపీ చూసిన సురేష్ బాబు వెంటనే ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకునేందుకు ఓకె చెప్పారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటించనున్నారు. -
పెళ్లి చూపులు నిర్మాతల 'మెంటల్ మదిలో..'
-
పెళ్లి చూపులు నిర్మాతల 'మెంటల్ మదిలో..'
'పెళ్ళిచూపులు' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ను అందించిన నిర్మాత రాజ్ కందుకూరి నిర్మిస్తున్న తాజా చిత్రం 'మెంటల్ మదిలో'. శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకుడు. పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకొన్న వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు లాంచ్ చేశారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ.. 'ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్ లో కథ గురించి చెప్పిన విషయాలు ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. 'పెళ్ళిచూపులు' తరహాలోనే 'మెంటల్ మదిలో' కూడా ఘన విజయం సాధించాలని కోరుకొంటున్నాను. వివేక్ ఆత్రేయ ఓ సరికొత్త ప్రయత్నంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు' అన్నారు. నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. 'సురేష్ బాబుగారు మా 'మెంటల్ మదిలో' ట్రైలర్ ను విడుదల చేసి.. క్వాలీటీ అండ్ కంటెంట్ చూసి మమ్మల్ని అభినందించడం చాలా ఆనందంగా ఉంది. చాలా పాజిటివ్ బజ్ ఉన్న సినిమా ఇది. మా టీం అంతా కూడా సినిమా రిజల్ట్ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. త్వరలోనే ఆడియో విడుదల చేసి.. విడుదల తేదీని ప్రకటిస్తాం' అన్నారు. -
డబ్బింగ్ కార్యక్రమాల్లో 'మెంటల్ మదిలో'
గత ఏడాది పెళ్లిచూపులు సినిమాతో ఘనవిజయం సాధించిన రాజ్ కందుకూరి నిర్మాణంలో తెరకెక్కుతున్న మరో సినిమా మెంటల్ మదిలో.. అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా యూనిట్ షూటింగ్ ముగించుకునే డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభిస్తోంది. న్యూ ఏజ్ యూత్ ఫుల్ రోమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నివేతా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుండగా యువ ప్రతిభాశాలి వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ''పెళ్ళిచూపులు' విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఓ వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను. శ్రీవిష్ణు, నివేతాల జంట చాలా బాగుంది, శ్రీవిష్ణు నేచురల్ పెర్ఫార్మెన్స్, వివేక్ ఆత్రేయ టేకింగ్ 'మెంటల్ మదిలో' చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. మా ధర్మపధ క్రియేషన్స్ బ్యానర్ నుంచి వస్తున్న మరో మంచి చిత్రం 'మెంటల్ మదిలో' అని గర్వంగా చెప్పగలను. ఇవాళే డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టాం.. జూలైలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే ట్రైలర్ మరియు ఆడియో విడుదల తేదీలు ప్రకటిస్తాం' అన్నారు. -
ఒక్క హిట్.. ఫుల్ కిక్ ఇచ్చింది
ప్రేమ ఇష్క్ కాదల్, ప్రతినిథి, సన్నాఫ్ సత్యమూర్తి, జయమ్ము నిశ్చయమ్మురా లాంటి చిత్రాల్లో కీలకపాత్రల్లో నటించిన యువ నటుడు శ్రీ విష్ణు. మంచి పాత్రలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు, అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయాడు. ఈ సినిమాలో నారా రోహిత్ కూడా మరో కీలక పాత్రలో నటించినప్పటికీ.., శ్రీ విష్ణు చుట్టే కథ నడవటంతో పాటు విష్ణు ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయటంతో సక్సెస్‌తో పాటు వరుస అవకాశలు క్యూ కట్టాయి. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఇప్పటికే మా అబ్బాయి సినిమాను పూర్తి చేసిన శ్రీ విష్ణు.. మరో ఇంట్రస్టింగ్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. పెళ్లి చూపులు లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాన్ని అందించిన రాజ్ కందుకూరి నిర్మాణంలో తెరకెక్కుతున్న మెంటల్ మదిలో షూటింగ్లో పాల్గొంటున్నాడు. వీటితో పాటు నీది నాది ఒకే కథ అనే సినిమాను త్వరలో ప్రారంభించనున్నాడు. కథా బలం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న శ్రీ విష్ణు, మరిన్ని విజయాలతో దూసుకుపోయేందుకు ప్లాన్ చేస్తున్నాడు.