
ఒక్క హిట్.. ఫుల్ కిక్ ఇచ్చింది
ప్రేమ ఇష్క్ కాదల్, ప్రతినిథి, సన్నాఫ్ సత్యమూర్తి, జయమ్ము నిశ్చయమ్మురా లాంటి చిత్రాల్లో కీలకపాత్రల్లో నటించిన యువ నటుడు శ్రీ విష్ణు. మంచి పాత్రలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు, అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో ఒక్కసారిగా స్టార్గా మారిపోయాడు. ఈ సినిమాలో నారా రోహిత్ కూడా మరో కీలక పాత్రలో నటించినప్పటికీ.., శ్రీ విష్ణు చుట్టే కథ నడవటంతో పాటు విష్ణు ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయటంతో సక్సెస్తో పాటు వరుస అవకాశలు క్యూ కట్టాయి.
ప్రస్తుతం ఈ యంగ్ హీరో ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఇప్పటికే మా అబ్బాయి సినిమాను పూర్తి చేసిన శ్రీ విష్ణు.. మరో ఇంట్రస్టింగ్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. పెళ్లి చూపులు లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాన్ని అందించిన రాజ్ కందుకూరి నిర్మాణంలో తెరకెక్కుతున్న మెంటల్ మదిలో షూటింగ్లో పాల్గొంటున్నాడు. వీటితో పాటు నీది నాది ఒకే కథ అనే సినిమాను త్వరలో ప్రారంభించనున్నాడు. కథా బలం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న శ్రీ విష్ణు, మరిన్ని విజయాలతో దూసుకుపోయేందుకు ప్లాన్ చేస్తున్నాడు.