'Em Chesthunnav' Movie Teaser Launched By Sree Vishnu - Sakshi
Sakshi News home page

Em Chestunnav Movie: చిన్న సినిమాలకు మీడియా సపోర్ట్‌ చేయాలి: శ్రీవిష్ణు

Published Sat, Aug 12 2023 2:32 PM | Last Updated on Sat, Aug 12 2023 3:03 PM

Em Chestunnav Movie Teaser launched By Sri vishnu - Sakshi

‘చిన్న సినిమాలకు ప్రమోషన్స్‌ కొంచెం కష్టం. కానీ మీడియా సపోర్ట్‌ చేస్తే అదేమంత కష్టం కాదు. కొత్తవాళ్లను ఎంకరేజ్‌ చేయాలి. నాకు సపోర్ట్‌ చేసినట్లే ‘ఏం చేస్తున్నావ్‌’ చిత్రబృందానికి కూడా మీడియా సపోర్ట్‌ చేయాలని కోరుతున్నాను’ అని హీరో శ్రీవిష్ణు అన్నారు. విజయ్ రాజ్ కుమార్, నేహా పఠాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం 'ఏం చేస్తున్నావ్’. భరత్ మిత్ర దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రాన్ని NVR ప్రొడక్షన్, SIDS క్రియేటివ్ వరల్డ్ బ్యానర్లపై నవీన్ కురవ, కిరణ్ కురవ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ టీజర్‌ని హీరో శ్రీవిష్ణు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఏం చేస్తున్నావ్’..  నా జీవితంలో ఎక్కువగా ఉన్న ప్రశ్న ఇదే . ఇందులో చాలా అర్థాలు ఉంటాయి. టైటిల్‌తో పాటు టీజర్ కూడా చాలా బాగుంది. గోపి సుందర్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుందని సాంగ్స్ చాలా బాగున్నాయి. డైరెక్టర్ భరత్ కు మంచి విజన్ ఉంది. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

‘ఈ చిత్రం 18-30 ఏళ్ల వయసు వారికి బాగా కనెక్ట్‌ అవుతుంది. థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకుడికి మంచి అనుభూతి అందిస్తుంది’అని దర్శకుడు భరత్‌ మిశ్రా అన్నారు. సినిమా మస్త్ ఉంటదని,  ఫస్ట్ ఆఫ్ డీసెంట్ గా ఉంటుందని, సెకండ్ హాఫ్ తల తిప్పుకొని సన్నివేశాలు ఉంటాయని హీరో విజయ రాజ్ కుమార్ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
 
Advertisement