ఇంకో సినిమా | Sree Vishnu To Romance Nivetha Thomas | Sakshi
Sakshi News home page

ఇంకో సినిమా

Published Sat, Jun 9 2018 12:33 AM | Last Updated on Sat, Jun 9 2018 12:33 AM

Sree Vishnu To Romance Nivetha Thomas - Sakshi

నివేథా థామస్

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం మలయాళ కథానాయికల హవా కొనసాగుతోంది. కీర్తీ సురేశ్, అనుపమా పరమేశ్వరన్, అనూ ఇమ్మాన్యుయేల్, నివేథా థామస్, మాళవికా నాయర్‌..  అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మల్లో నివేథా కొంచెం స్లో అయ్యారు.  దానికి కారణం ఉంది. ‘జెంటిల్‌మెన్‌’, ‘నిన్ను కోరి, జై లవ కుశ’ సినిమాలతో హ్యాట్రిక్‌ హిట్స్‌ అందుకున్నారీ మాలీవుడ్‌ బ్యూటీ. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చినా ఒప్పుకోకుండా స్టడీస్‌పై కాన్సన్‌ట్రేట్‌ చేసి, డిగ్రీ పూర్తి చేశారు నివేథా. స్మాల్‌ బ్రేక్‌కి కారణం ఇదే.

కొంచెం స్లో అయిన నివేథా ఇప్పుడు సినిమాలు చేసే విషయంలో స్పీడ్‌ పెంచారు. ప్రస్తుతం కల్యాణ్‌రామ్‌తో ఓ సినిమా చేస్తోన్న ఈ బ్యూటీ తాజాగా మరో చిత్రం అంగీకరించారట. ‘మెంటల్‌ మదిలో, నీదీ నాదీ ఒకే కథ’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీవిష్ణుతో జోడీ కట్టనున్నారట ఆమె. ‘మెంటల్‌ మదిలో’ చిత్ర దర్శకుడు వివేక్‌ ఆత్రేయ శ్రీవిష్ణుతో ఓ సినిమా తెరకెక్కించనున్నారట. ఈ చిత్రంలోనే నివేథా నటించనున్నారట. నటనకు అవకాశం ఉన్న పాత్రలకు ప్రాధాన్యం ఇచ్చే నివేథా ఇక పైనా అలాంటివే చేయాలనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement