రాజరాజచోర ప్రారంభం | Sree Vishnu's Raja Raja Chora Shoot Resumes | Sakshi
Sakshi News home page

రాజరాజచోర ప్రారంభం

Published Thu, Oct 8 2020 12:58 AM | Last Updated on Thu, Oct 8 2020 12:58 AM

Sree Vishnu's Raja Raja Chora Shoot Resumes  - Sakshi

శ్రీ విష్ణు హీరోగా హసిత్‌ గోలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాజ రాజ చోర’. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కరోనా బ్రేక్‌ తర్వాత ఈ సినిమా చిత్రీకరణ మంగళవారం తిరిగి ప్రారంభం అయింది. మేఘా ఆకాశ్, సునయిన కథానాయికలు. యస్పీ బాలసుబ్రహ్మణ్యంకి నివాళులు అర్పించి, చిత్రీకరణ ప్రారంభించారు. ‘ఒక వినూత్నమైన కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది’ అన్నారు నిర్మాతలు టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌. ‘సినిమా పూర్తయ్యేవరకూ రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుతాం’ అన్నారు సహనిర్మాత వివేక్‌ కూచిభొట్ల. తనికెళ్ల భరణి, రవిబాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు కెమెరా: వేదరామన్, సంగీతం: వివేక్‌ సాగర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement