
ధైర్యంగా సినిమా తీసినందుకు అభినందనలు – రోజా
‘‘ఓ మంచి కథను నమ్మి, ధైర్యంగా సినిమా తీసిన ప్రకాశ్‌రావుగారికి అభినందనలు. డైరెక్టర్ టేకింగ్ గొప్పగా ఉంది. శ్రీ విష్ణు చక్కగా నటించడంతో పాటు డ్యాన్సులు బాగా చేశాడు. ఈ సినిమా విజయవంతమై, ఇదే యూనిట్ మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నా’’ అని రోజా అన్నారు. శ్రీ విష్ణు, చిత్రా శుక్లా జంటగా కుమార్ వట్టి దర్శకత్వంలో బేబి సాక్షి సమర్పణలో బలగం ప్రకాశ్‌రావు నిర్మిస్తోన్న చిత్రం ‘మా అబ్బాయి’. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ సినిమా పాటల సీడీలను హీరోలు నారా రోహిత్, నాగశౌర్య విడుదల చేశారు. రోజా, నిర్మాత మల్కాపురం శివకుమార్, దర్శకుడు విరించి వర్మ ట్రైలర్ రిలీజ్ చేశారు. ‘‘శ్రీకాకుళంలో పుట్టిన నేను ఈ రోజు సినిమా నిర్మించడం ద్వారా ఏదో సాధించానని అనుకుంటున్నా.
దర్శకుడు కథ చెప్పగానే సినిమా చేయగలుగుతాడా? అనిపించింది. కానీ, వట్టి కుమార్ కాదు.. తాను గట్టి కుమార్ అని నిరూపించుకున్నాడు’’ అని నిర్మాత అన్నారు. ‘‘మార్తాండ్ కె.వెంకటేశ్‌గారి వద్ద ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నప్పుడు సినిమా ఎలా తీయాలో నేర్చుకున్నా. ‘మా అబ్బాయి’ పాత్రకు వేరే ఎవరూ సరిపోరనేలా శ్రీవిష్ణు నటించాడు’’ అన్నారు దర్శకుడు. శ్రీవిష్ణు, మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, నిర్మాత సాయి కొర్రపాటి, ఐజీ ఎ.రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.