
కాజల్ అగర్వాల్
సౌత్ ఇండస్ట్రీల్లో దాదాపు స్టార్ హీరోలందరితో నటించారు కాజల్ అగర్వాల్. ఇప్పుడు యంగ్ హీరోలతోనూ ఆమె సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీవిష్ణు హీరోగా ప్రదీప్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో శ్రీవిష్ణుకి జోడీగా కాజల్ నటించనున్నారని సమాచారం. ఈ సినిమాలో శ్రీవిష్ణు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారట. శ్రీవిష్ణుతో కాజల్ నటించడం ఇదే తొలిసారి. మరి.. ఇలానే యంగ్ హీరోలతోనూ వరుసగా కాజల్ జోడీ కట్టాలనుకుంటున్నారా? వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment