
యంగ్ హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా చైతన్య దంతులూరి దర్శకత్వంతో తెరకెక్కుతోన్న వైవిధ్యమైన చిత్రం ‘భళా తందనాన’. ఇందులో కేథరిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల ఈమూవీ షూటింగ్ కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో విలన్‌గా కేజీఎఫ్ ఫేం రామచంద్రరాజు(గరుడ) నటిస్తున్నాడు. అయితే ఈ రోజు రామచంద్రరాజు పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీలో ఆయన ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.
అంతేగాక ఈ సందర్భంగా అతడి పాత్రను కూడా మూవీ యూనిట్ వెల్లడించింది. ‘ఆనంద్ బలిగా గరుడ రామ్’ అంటూ చిత్ర బృందం ఫస్ట్‌లుక్‌ను షేర్ చేసింది. ఇందులో గడ్డంతో ఉన్న రామ్‌ను చూస్తుంటే ఆనంద్ బలిగా పవర్ ఫుల్ విలన్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సాయి కొర్రపాటి వారాహి చలన చిత్ర బ్యానర్‌పై రజనీ కొర్రపాటి ఈ మూవీని నిర్మిస్తున్నాడు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment