‘‘స్క్రీన్ టైమ్ కాదు.. కథలో నా పాత్రకు ప్రాముఖ్యత ఉండాలని కోరుకుంటున్నాను. ఎగై్జట్ చేసిన స్క్రిప్ట్స్‌నే ఒప్పుకుంటున్నాను’’ అన్నారు నివేదా థామస్. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో శ్రీవిష్ణు, నివేదా థామస్ జంటగా నటించిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. మన్యం విజయ్‌కుమార్ నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను ఈ నెల 28న విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా నివేదా థామస్ చెప్పిన కబుర్లు.
► ఇందులో నా పాత్ర పేరు మిత్రా. క్లాసికల్ డ్యాన్సర్ కావాలన్నది మిత్రా కోరిక. నా రియల్‌లైఫ్‌లో నా ఐదేళ్లప్పుడే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నా. హ్యూమన్ రిలేషన్‌షిప్స్ ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. ప్రస్తుతం సమాజంలో ఏం జరుగుతుందనే విషయాలను ఆసక్తికరంగా చూపించాం. మహిళలపై వేధింపుల అంశాన్ని చర్చించాం. స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా ఉంటుంది.
► ‘ఆర్ 3’ బ్యాచ్ (శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ) వల్ల మిత్రా లైఫ్‌లో కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనల ప్రభావం ఆర్3 బ్యాచ్‌పై పడుతుంది. ఈ పరిస్థితుల్లో ఎవరు ఎవర్ని ఎలా కాపాడుకున్నారు అన్నదే కథాంశం. ఇది ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్ కాదు. సినిమాలోని అందరి పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సినిమా చేసిన తర్వాత నా లైఫ్‌లో ఆర్ 3 బ్యాచ్‌లాంటి వారు ఉంటే బాగుండు అనిపించింది. వివేక్ ఆత్రేయ మంచి డైరెక్టర్. మంచి అవుట్‌పుట్ ఇచ్చారు.
► నేనేం చేసినా ఒక పద్ధతి ప్రకారం చేయాలనుకుంటాను. సీన్‌కు అవసరం అయితేనే హోమ్‌వర్క్ చేస్తాను. రొటీన్ సినిమాలు చేయడం నాకు అంతగా ఇష్టం ఉండదు. ఈ సినిమాకు నేనే డబ్బింగ్ చెప్పాను. ‘జెంటిల్‌మన్’ అప్పుడే నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పాలనుకున్నాను. కుదర్లేదు. ‘118’ చిత్రం నుంచి నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటున్నా.
► తమిళంలో సినిమాలు చేయకపోవడానికి పెద్దగా కారణం ఏమీ లేదు. ‘జెంటిల్‌మన్’ తర్వాత తెలుగులో నాకు చాలా మంచి స్క్రిప్ట్స్ వచ్చాయి. చేస్తున్నాను. హైదరాబాద్‌లో ఇల్లు కొనలేదు. కొనే ఆలోచనలో ఉన్నాను.
► ‘మీటూ’ అనేది మూమెంట్. మహిళలపై వేధింపులనేవి అన్ని రంగాల్లోనూ ఉన్నాయి. యాక్టర్స్ పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి ఈజీగా కామెంట్ చేయొచ్చని కొందరు అనుకుంటారు. సోషల్‌మీడియాలో నా పై ట్రోల్స్‌ను పట్టించుకోను.
► ప్రస్తుతం ఇంద్రగంటిగారి ‘వి’లో నటిస్తున్నా. ‘శ్వాస’ సినిమా ప్రీ–ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. రజనీకాంత్‌గారి ‘దర్బార్’ సినిమాలో నటిస్తున్నానా? లేదా? అనేది నేను చెప్పలేను. చిత్రబృందం అధికారికంగా చెబితే బాగుంటుందన్నది నా అభిమతం.
Comments
Please login to add a commentAdd a comment