శ్రీవిష్ణు మంచి కథలను ఎంపిక చేసుకుంటాడు | vv vinayak at thippara meesam pre release event | Sakshi
Sakshi News home page

శ్రీవిష్ణు మంచి కథలను ఎంపిక చేసుకుంటాడు

Published Tue, Nov 5 2019 12:12 AM | Last Updated on Tue, Nov 5 2019 4:42 AM

రిజ్వాన్, నిక్కీ తంబోలి, శ్రీవిష్ణు, నారా రోహిత్, వీవీ వినాయక్, విజయ్‌కృష్ణ - Sakshi

రిజ్వాన్, నిక్కీ తంబోలి, శ్రీవిష్ణు, నారా రోహిత్, వీవీ వినాయక్, విజయ్‌కృష్ణ

‘‘మంచి కథలను ఎంపిక చేసుకుంటూ, ఆ కథల్లో తాను ఇన్వాల్వ్‌ అవుతూ కొత్త రకం సినిమాలు చేస్తున్నాడు శ్రీవిష్ణు. తను నటించిన సూపర్‌హిట్‌ సినిమా ‘బ్రోచేవారెవరురా’ని  మూడుసార్లు చూశాను’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్‌. శ్రీవిష్ణు, నిక్కీ తంబోలి జంటగా ‘అసుర’ చిత్ర దర్శకుడు విజయ్‌కృష్ణ. ఎల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తిప్పరా మీసం’. శ్రీ హోమ్‌ సినిమాస్‌ సమర్పణలో రిజ్వాన్‌ నిర్మించారు. గ్లోబల్‌ సినిమాస్‌ ద్వారా ఈ నెల 8న విడుదలవుతున్న ఈ చిత్రం ప్రీ–రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది.

ఈ వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వీవీ వినాయక్‌ మాట్లాడుతూ– ‘‘మంచి సినిమాలు చేస్తే ప్రేక్షకుల్లో, సినీ పరిశ్రమలో మంచి గౌరవం సంపాదించుకున్నారు శ్రీవిష్ణు. ఇకముందు కూడా ఇలాగే మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. ఈ చిత్రం ట్రైలర్, పోస్టర్స్‌ చాలా బావున్నాయి’’ అన్నారు. నారా రోహిత్‌ మాట్లాడుతూ– ‘‘సినిమా చూశాను. నాకు బాగా నచ్చింది. అద్భుతమైన సినిమా. శ్రీవిష్ణు ఇంకా పెద్ద సినిమాలు చేయాలి’’ అన్నారు. శ్రీవిష్ణు మాట్లాడుతూ– ‘‘చాలా దగ్గరగా నన్ను చూసిన దర్శకుడు విజయ్‌ నాకు నెగటివ్‌ క్యారెక్టరు డిజైన్‌ చేశాడు.

ప్రపంచంలో ఏదైనా మారొచ్చు కానీ అమ్మ ప్రేమ ఎప్పటికీ మారదు. తల్లి గొప్పదనం గురించి చెప్పే చిత్రంలో నటించినందుకు గర్వంగా ఉంది’’ అన్నారు. దర్శకుడు విజయ్‌ మాట్లాడుతూ– ‘‘మేం చేసిన ఈ మంచి ప్రయత్నం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. శ్రీవిష్ణు పాత్రకు ఎంత ఇంపార్టెన్స్‌ ఉందో తల్లి పాత్రలో నటించిన రోహిణి గారికి అంతే ఇంపార్టెన్స్‌ ఉంది’’ అన్నారు. ‘‘నా పాత్రను ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు’’ అన్నారు నటి రోహిణి. రిజ్వాన్‌ మాట్లాడుతూ– ‘‘విజయ్‌ ది బెస్ట్‌ ఫిల్మ్‌ను ఇచ్చాడు.. సురేశ్‌ బొబ్బిలి సంగీతానికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది’’ అన్నారు. ఇంకా ఈ వేడుకలో నిర్మాత యం.ఎల్‌. కుమార్‌ చౌదరి, బెనర్జీ, అచ్యుత రామారావు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement