Thippara Meesam
-
తిప్పరా మీసం : మూవీ రివ్యూ
టైటిల్: తిప్పరా మీసం జానర్: థ్రిల్లర్ నటీనటులు: శ్రీవిష్ణు, నిక్కీ తంబోలీ, సీనియర్ నటి రోహిణి, బెనర్జీ, దర్శకుడు: ఎల్ కృష్ణవిజయ్ నిర్మాత: రిజ్వాన్ సంగీతం: సురేశ్ బొబ్బిలి డీవోపీ: సిద్ వైవిధ్యభరితమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న నటుడు శ్రీవిష్ణు.. అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాదీ ఒకే కథ, బ్రోచేవారెవరురా వంటి సినిమాలతో శ్రీవిష్ణు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేశాడు. ఈ ఏడాది వచ్చిన బ్రోచేవారెవరుతో మంచి విజయాన్ని అందుకున్న ఈ యువ హీరో తాజాగా ‘తిప్పరా మీసం’ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా టీజర్, ట్రైలర్లో శ్రీవిష్ణు నెగటివ్ షెడ్స్‌తో డిఫరెంట్ లుక్‌లో కనిపించడంతో మంచి హైప్ క్రియేట్ అయింది. ఈ క్రమంలో శ్రీవిష్ణు ‘తిప్పరా మీసం’ అంటూ మరోసారి ప్రేక్షకులను అలరించాడా? మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడా? తెలుసుకుందాం పదండి.. కథ: మణిశంకర్ (శ్రీవిష్ణు) చిన్న వయస్సులోనే చెడు సాహవాలతో డ్రగ్స్‌కు అలవాటుపడుతాడు. ఇలాగే వదిలేస్తే.. అతని పరిస్థితి చేయిదాటిపోతుందేమోనని, డ్రగ్స్‌కు పూర్తిగా బానిస అవుతాడేమోనని భయపడి తల్లి లలితాదేవి (రోహిణి) అతన్ని రిహాబిటేషన్ సెంటర్లో చేరుస్తోంది. అక్కడ ఎవరూ తోడులేక తీవ్ర ఒంటరితనంలో మగ్గిపోయిన మణి.. తల్లి మీద ద్వేషం పెంచుకుంటాడు. అక్కడి నుంచి పారిపోయి ఓ పబ్‌లో డీజేగా పనిచేస్తూ ఇష్టారాజ్యంగా బతుకుతుంటాడు. తల్లి ఇంటి గడప కూడా తొక్కని అతని.. డబ్బుల కోసం మాత్రం తల్లిని వేధిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ క్రికెట్ బూకీ వద్ద తాను చేసిన అప్పును తీర్చేందుకు ఏకంగా తల్లి మీద మణి కోర్టులో కేసు వేస్తాడు. ఆమె రూ. 5 లక్షల చెక్కు ఇస్తే.. దానిని ఫోర్జరీ చేసి.. అది బౌన్స్ కావడంతో తల్లిని కోర్టుకీడుస్తాడు. ఏదీఏమైనా పరిస్థితులకు ఎదురెళ్లి తను అనుకున్నది సాధించాలనుకునే మణి.. అనూహ్య పరిణామాల నడుమ ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. కాళీతో గొడవలు ఉన్నప్పటికీ.. అతన్ని తాను హత్య చేసినట్టు చెప్పి మణి జైలుశిక్ష అనుభవిస్తాడు. అసలు కాళీని చంపిందెవరు? ఆ మర్డర్ కేసును మణి ఎందుకు ఒప్పుకున్నాడు? అసలు మణి మారిపోయి తల్లి ప్రేమను అంగీకరించి.. మంచి వాడిగా మారడానికి కారణమేమిటి? అన్నది సినిమాలో చూడాలి. విశ్లేషణ: తల్లీకొడుకుల బంధం బేసిక్ హ్యూమన్ రిలేషన్. అలాంటి కనీస మానవీయ బంధాన్ని కోర్టుకీడ్చిన కొడుకు.. చివరకు మంచి మనిషిగా ఎలా మారిపోయాడనే కథ బాగానే ఉన్నా.. దర్శకుడు స్క్రీన్‌ప్లేను ఆసక్తికరంగా మలచడంలో పూర్తిగా విఫలమయ్యాడు. సినిమా ఫస్టాఫ్ అంతా ఫ్లాట్‌గా సాగుతూ.. పెద్దగా ఆసక్తి రేకెత్తించదు. మణి క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేయడానికి డైరెక్టర్ దాదాపు ఫస్టాఫ్ అంతా సాగదీస్తున్నట్టు అనిపిస్తుంది. సినిమా మీద ఆసక్తి రేకెత్తించేలా కథనం సాగకపోగా.. మోనిక (నిక్కీ తంబోలీ)తో మణి లవ్, తనకు అప్పు ఇచ్చిన బూకీ జోసెఫ్‌తో మణి గొడవ, మణిని అతను ఏడురోజులపాటు బంధించడం ఈ సీన్లన్నీ బిట్లుబిట్లుగా వచ్చిపోయినట్టు అనిపిస్తాయి. డ్రగ్స్, మద్యం, స్మోకింగ్ అలవాటు వంటి సీన్లు చూపించినా మణి పాత్రలో పెద్దగా నెగిటివ్ షెడ్స్ ఉన్నట్టు అనిపించదు. అతని కోణంలో ప్రేక్షకుడికి అతనిపై జాలి కలుగుతుంది. పైగా చాలాచోట్ల మణి పాత్ర కూడా డైరెక్టర్ డల్‌గా డీల్ చేసినట్టు అనిపిస్తుంది. మదర్ సెంటిమెంట్‌తో తీసిన సినిమాలు చాలావరకు సూపర్‌హిట్ అయ్యాయి. ఈ సినిమాలో ఫస్టాఫ్‌లో తల్లీని కోర్టుకీడ్చడం.. కొడుకు కోసం తల్లి ఇల్లు అమ్మి డబ్బులు వంటి సీన్లు కొంతమేరకు బాగుండి ప్రేక్షకుల కనెక్ట్ అయ్యే అవకాశముంది. సెకండాఫ్‌లోనూ వచ్చే సీన్లు పెద్దగా ఆసక్తికరంగా అనిపించవు. శ్రీవిష్ణుకు మాస్ ఇమేజ్ కోసం ఈ సినిమాల్లో అక్కడక్కడ పెద్ద ఫైట్లే పెట్టారు. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ట్వీస్ట్.. మర్డర్ కేసును మణి ఎందుకు ఒప్పుకున్నాడు అనే అంశాలు ఒకింత ఆసక్తికరంగా ఉన్నాయి. క్లైమాక్స్‌లో మదర్ సెంటిమెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కానీ, అప్పటికే సినిమాతో ప్రేక్షకుడు కొంతవరకు డిస్ కనెక్ట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. మరోసారి శ్రీవిష్ణు తన నటనతో ఆకట్టుకున్నాడు. కథనం ఫ్లాట్‌గా ఉన్నా చాలా సీన్లలో, ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ సీన్లలో శ్రీవిష్ణు అదరగొట్టాడు. హీరోయిన్ నిక్కీ తంబోలీ పాత్ర కొద్దిసేపు అప్పుడప్పుడు కనిపిస్తుంది. కథలో భాగంగా నిక్కీ ఎస్సై పాత్రను పోషించిప్పటికీ పెద్దగా ఆకట్టుకునే సీన్లు లేవు. సీనియర్ నటి రోహిణి, బెనర్జీ, ఇతన నటులు తమ పరిధి మేరకు పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సురేశ్ బొబ్బలి అందించిన పాటలు అంతగా గుర్తుండకపోయినా.. నేపథ్య సంగీతం బావుంది. సినిమా నిర్మాణ విలువలు ఓ మోస్తరుగా ఉన్నాయి. సినిమా టైటిల్ ‘తిప్పరా మీసం’ అంటూ పౌరుషం రేకెత్తించేలా ఉన్నా.. సినిమా మాత్రం మీసం తిప్పేలా లేదు. బలాలు మదర్ సెంటిమెంట్ శ్రీవిష్ణు నటన బలహీనతలు స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా లేకపోవడం సాగదీత ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే అంశాలు అంతగా లేకపోవడం - శ్రీకాంత్ కాంటేకర్ -
సమయానికి వస్తాను... చెప్పింది చేస్తాను
‘‘ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చింది. కంటెంట్ అండ్ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలవైపే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. కానీ పెద్ద హీరోలు చేసిన కాన్సెప్ట్ సినిమాలు మాత్రమే ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరుతున్నాయి. ‘రంగస్థలం’ అందుకు ఓ ఉదాహరణ. మధ్య స్థాయి హీరోలు చేసిన కాన్సెప్ట్ సినిమాలు మల్టీఫ్లెక్స్‌లకే పరిమితం కాకూడదు. అందుకే స్క్రిప్ట్‌లో ఏయే అంశాలు కావాలో వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది’’ అని శ్రీవిష్ణు అన్నారు. విజయ్‌కృష్ణ. ఎల్ దర్శకత్వంలో శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘తిప్పరామీసం’. రిజ్వాన్ నిర్మించిన ఈ చిత్రం గ్లోబల్ సినిమాస్ ద్వారా రేపు విడుదల అవుతోంది. ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు చెప్పిన విశేషాలు. ► ‘తిప్పరామీసం’ సినిమాలో నేను నైట్ క్లబ్లో పని చేసే డీజే పాత్ర చేశాను. క్యారెక్టర్లో నెగటీవ్ షేడ్స్ ఉంటాయి. కాస్త రఫ్‌గా కనిపిస్తాను. ఈ సినిమా కోసం నేను బరువు పెరిగాను. ఫుల్‌గా మాస్ క్యారెక్టర్ కాదు. కానీ మాస్ అప్పీల్ ఉంటుంది. చాలా నిర్లక్ష్యంగా ఉండే క్యారెక్టర్. తినడం.. తాగడం.. పడుకోవడం. అలాంటి అతని జీవితం కొన్ని అనుకోని సంఘటనల కారణంగా ఎలా ప్రభావితం అయ్యిందన్నదే కథ. తెలుగు ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని మూడు సీక్వెన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. అవి ప్రేక్షకులకు నచ్చుతాయని ఆశిస్తున్నాం. ► సినిమాలో అమ్మ సెంటిమెంట్ ఉంటుంది. అమ్మ కోసం హీరో ఏ పని చేసి గర్వంగా ఫీల్ అయ్యాడో, ఏ పరిస్థితుల్లో మీసం తిప్పాడో వెండితెరపై చూసినప్పుడు ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉంటుంది. తల్లి పాత్రలో రోహిణిగారు అద్భుతంగా నటించారు. దర్శకుడు విజయ్ సినిమాను బాగా తీశాడు. ► విజయ్ అసోసియేషన్‌లో ఎక్కువ సినిమాలు చేయడానికి ప్రత్యేకమైన కారణం లేదు. నేను, నారా రోహిత్, విజయ్ భాగస్వాములం. నాతో పని చేసిన ఎవరైనా నాతో మళ్లీ వెంటనే సినిమా చేస్తామంటారు. కానీ నాకు ఉన్న ఇతర కమిట్మెంట్స్ గురించి కూడా ఆలోచించాలి. నాతో వర్క్ చేయడం కంఫర్ట్‌గా ఉంటుందని దర్శకుడు విజయ్ కృష్ణ చెప్పారంటే సంతోషంగా ఉంది. నేను ఎవరితో సినిమా చేసినా సమయానికి వెళతాను.. దర్శకులు చెప్పింది చేస్తాను. ► ‘బ్రోచెవారెవరురా’ సినిమా నన్ను మరింత మంది ప్రేక్షకులకు చేరువ చేసింది. ఈ సినిమాలో క్రేజీ కామెడీ ఉంది. కానీ కామెడీ మాత్రమే ప్రేక్షకులకు చాలదు. కథలో కంటెంట్ కూడా బాగుండాలి. ‘బ్రోచేవారెవరురా’ తర్వాత వస్తున్న నా చిత్రాలపై అంచనాలు ఉండొచ్చు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత బాధ్యతగా సినిమాలు చేస్తున్నాను. ► నా కెరీర్ మొదట్లో నా దగ్గరకు కమర్షియల్ కథలు వచ్చేవి. కానీ ఇప్పుడు భిన్నమైన కథలే వస్తున్నాయి. నేను కూడా రెగ్యులర్ సినిమాలు చేయాలనుకోవడం లేదు. కానీ పెద్ద హీరోలు చేసే కమర్షియల్ సినిమాలు చూస్తాను. ఎంజాయ్ చేస్తాను. అయితే నేను కాన్సెప్ట్ సినిమాలు చేస్తాను. క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు వస్తే చేయడానికి సిద్ధమే. కథ నచ్చాలి. ► ఇప్పటికే మూడు సినిమాలు కమిట్ అయ్యాను. ఈ సినిమాల చిత్రీకరణ పూర్తయ్యాక పారితోషికం పెంపుదల గురించి ఆలోచిస్తాను. నారా రోహిత్‌తో కలిసి నేను నటించాల్సిన ఓ పీరియాడికల్ మూవీ కోసం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. బహుశా వచ్చే ఏడాది మొదలుకావొచ్చు. -
‘నిన్ను కన్నందుకు నీ తల్లి బాధపడాలి’
విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శ్రీవిష్ణు ‘తిప్పరా మీసం’అంటూ మరో విభిన్న కథా చిత్రంతో నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాది ఒకే కథ, బ్రోచేవారెవరురా సినిమాలతో మెప్పించిన శ్రీ విష్ణు.. ఈసారి ‘తిప్పరా మీసం’ అనే యాక్షన్ ఎంటర్టైనర్తో అలరించనున్నాడు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ లభించింది. సినిమా విడుదలకు కొన్ని గంటల సమయమే ఉన్నందున ఈ మూవీపై హైప్ క్రియేట్ చేసేందుకు చిత్ర యూనిట్ అన్ని ప్రయత్నాలు మొదలు పెట్టింది. దీనిలో భాగంగా చిత్ర ట్రైలర్‌ను తాజాగా విడుదల చేసింది. ట్రైలర్‌ను చూస్తుంటే అమ్మ సెంటిమెంట్ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంది. ‘నా గతాన్ని.. నా సమస్యను గుర్తించని ఈ పనికిమాలిన సమాజం, నేను చేసింది తప్పు అని ఓ ముద్ర వేసింది’, ‘వాడికున్న కోపమంతా వాడి అమ్మమీదే’ ,‘కన్న తల్లిని రోడ్డుకీడ్చిన కొడుకుగా చరిత్రలో నిలిచిపోతావ్’, ‘ నిన్ను కన్నందుకు నీ తల్లి బాధపడాలి’, ‘అందరూ నేను అర్థం కాని వెదవనని అనుకుంటారు. కానీ ఎవడేమనుకుంటే నాకేంటి.. నేననుకున్నదే చేస్తా’ అంటూ ట్రైలర్లో శ్రీవిష్ణు చెప్పే డైలాగ్‌లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ చిత్రం భారీ విజయం సాధించడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ట్రైలర్లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా లేదు.. పీక్స్‌లో ఉంది. ఈ చిత్రానికి ‘అసుర’తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీవిష్ణు సరసన నిక్కి తంబోలి హీరోయిన్గా నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతమందిస్తున్న ఈసినిమాకు సిధ్ సినిటోగ్రాఫర్. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి దర్శకుడు కృష్ణ విజయ్ ఎల్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. -
శ్రీవిష్ణు మంచి కథలను ఎంపిక చేసుకుంటాడు
‘‘మంచి కథలను ఎంపిక చేసుకుంటూ, ఆ కథల్లో తాను ఇన్వాల్వ్ అవుతూ కొత్త రకం సినిమాలు చేస్తున్నాడు శ్రీవిష్ణు. తను నటించిన సూపర్‌హిట్ సినిమా ‘బ్రోచేవారెవరురా’ని మూడుసార్లు చూశాను’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్. శ్రీవిష్ణు, నిక్కీ తంబోలి జంటగా ‘అసుర’ చిత్ర దర్శకుడు విజయ్‌కృష్ణ. ఎల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తిప్పరా మీసం’. శ్రీ హోమ్ సినిమాస్ సమర్పణలో రిజ్వాన్ నిర్మించారు. గ్లోబల్ సినిమాస్ ద్వారా ఈ నెల 8న విడుదలవుతున్న ఈ చిత్రం ప్రీ–రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘మంచి సినిమాలు చేస్తే ప్రేక్షకుల్లో, సినీ పరిశ్రమలో మంచి గౌరవం సంపాదించుకున్నారు శ్రీవిష్ణు. ఇకముందు కూడా ఇలాగే మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. ఈ చిత్రం ట్రైలర్, పోస్టర్స్ చాలా బావున్నాయి’’ అన్నారు. నారా రోహిత్ మాట్లాడుతూ– ‘‘సినిమా చూశాను. నాకు బాగా నచ్చింది. అద్భుతమైన సినిమా. శ్రీవిష్ణు ఇంకా పెద్ద సినిమాలు చేయాలి’’ అన్నారు. శ్రీవిష్ణు మాట్లాడుతూ– ‘‘చాలా దగ్గరగా నన్ను చూసిన దర్శకుడు విజయ్ నాకు నెగటివ్ క్యారెక్టరు డిజైన్ చేశాడు. ప్రపంచంలో ఏదైనా మారొచ్చు కానీ అమ్మ ప్రేమ ఎప్పటికీ మారదు. తల్లి గొప్పదనం గురించి చెప్పే చిత్రంలో నటించినందుకు గర్వంగా ఉంది’’ అన్నారు. దర్శకుడు విజయ్ మాట్లాడుతూ– ‘‘మేం చేసిన ఈ మంచి ప్రయత్నం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. శ్రీవిష్ణు పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో తల్లి పాత్రలో నటించిన రోహిణి గారికి అంతే ఇంపార్టెన్స్ ఉంది’’ అన్నారు. ‘‘నా పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేశారు’’ అన్నారు నటి రోహిణి. రిజ్వాన్ మాట్లాడుతూ– ‘‘విజయ్ ది బెస్ట్ ఫిల్మ్‌ను ఇచ్చాడు.. సురేశ్ బొబ్బిలి సంగీతానికి మంచి రెస్పాన్స్ వచ్చింది’’ అన్నారు. ఇంకా ఈ వేడుకలో నిర్మాత యం.ఎల్. కుమార్ చౌదరి, బెనర్జీ, అచ్యుత రామారావు తదితరులు పాల్గొన్నారు. -
అప్పటి నుంచి మా ప్రయాణం మొదలైంది
‘‘అసుర’ సినిమా నుంచి విజయ్ కృష్ణ, నా ప్రయాణం కొనసాగుతోంది. మాకు ఒక ప్లాట్‌ఫామ్ కావాలని రెండు మూడు సినిమాలు నిర్మించాం. అందులో నేను చిన్న చిన్న వేషాలు వేశాను. నేను కొంచెం మంచి సినిమాలు చేశాక ఇద్దరం సినిమా చేద్దామనుకున్నాం. తను ఇచ్చిన మాట కోసం నాతో ‘తిప్పరా మీసం’ సినిమా చేశాడు’’ అని శ్రీవిష్ణు అన్నారు. ‘అసుర’ ఫేమ్ విజయ్ కృష్ణ ఎల్. దర్శకత్వంలో శ్రీవిష్ణు, నిక్కీ తంబోలి జంటగా తెరకెక్కిన చిత్రం ‘తిప్పరా మీసం’. శ్రీ హోమ్ సినిమాస్ సమర్పణలో రిజ్వాన్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 8న గ్లోబల్ సినిమాస్ ద్వారా విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో దర్శకుడు విజయ్ కృష్ణ మాట్లాడుతూ– ‘‘ఒక మంచి సినిమా చేద్దామని నేను, శ్రీవిష్ణు ‘తిప్పరామీసం’ స్టార్ట్ చేశాం. ఆ తర్వాత నా ఫ్రెండ్ అచ్యుత రామారావు, రిజ్వాన్ జాయిన్ అయ్యారు. శ్రీవిష్ణు, నిక్కి బాగా నటించారు’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన రిజ్వాన్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు నిక్కీ తంబోలి. ‘‘ఈ సినిమాకి విజయ్ హార్ట్ అయితే, శ్రీవిష్ణు ప్రాణం. వారిద్దరూ కష్టపడి ఈ సినిమా చేశారు’’ అన్నారు రిజ్వాన్. సహనిర్మాత అచ్యుత రామారావు, హాస్యనటుడు నవీన్, సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, ఎడిటర్ ధర్మేంద్ర, పాటల రచయిత పూర్ణచారి పాల్గొన్నారు. -
తిప్పరా మీసం
అనుకున్నది సాధించినప్పుడో, పందెంలో గెలిచినప్పుడో మీసం తిప్పుతారు. ఇప్పుడు శ్రీవిష్ణు కూడా మీసం తిప్పుతున్నారు. మరి ఆయనేం చేశారో సినిమా చూసి తెలుసుకోవాలి. శ్రీవిష్ణు హీరోగా ఎల్. కృష్ణ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తిప్పరా మీసం’. నికీ తంబోలీ హీరోయిన్. శ్రీ ఓం బ్యానర్ సమర్పణలో రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్, కృష్ణ విజయ్ ప్రొడక్షన్స్ బ్యానర్లు నిర్మించిన ఈ చిత్రాన్ని నవంబర్ 8న విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ట్రైలర్, ఆడియోను త్వరలోనే రిలీజ్ చేస్తాం. థియేట్రికల్ రైట్స్‌ను ఏషియన్ సినిమాస్ బ్యానర్ తీసుకున్నారు’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: సురేశ్ బొబ్బిలి, కెమెరా: సి«ద్. -
శత్రువు కూడా వ్యసనమే
‘మందు, సిగరెట్, అమ్మాయిలా.. శత్రువు కూడా వ్యసనమే.. ఆ వ్యసనానికి నేనూ బానిసనే’ అంటూ శ్రీవిష్ణు చెప్పే డైలాగ్‌తో ‘తిప్పరా మీసం’ చిత్రం టీజర్ విడుదలైంది. శ్రీవిష్ణు, నిక్కీ తంబోలి జంటగా కృష్ణ విజయ్.ఎల్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కృష్ణ విజయ్ ఎల్ ప్రొడక్షన్, శ్రీ ఓం సినిమా పతాకాలపై రూపొందుతోన్న ఈ సినిమా టీజర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘యాక్షన్ రివెంజ్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రమిది. మా సినిమా టీజర్‌కు, శ్రీవిష్ణు డైలాగ్‌కి అనూహ్య స్పందన వస్తో్తంది. శ్రీవిష్ణుని కృష్ణ విజయ్ ఆవిష్కరించిన తీరు, లుక్ అందర్నీ ఆకట్టుకుంటోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: ఖుషీ, అచ్యుత్ రామారావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మనోజ్ మావిళ్ల, సంగీతం: సురేశ్ బొబ్బిలి, కెమెరా: సిద్. -
తిప్పరా మీసం టీజర్
-
ఆ వ్యసనానికి నేను కూడా బానిసనే
బ్రోచేవారెవరురా అంటూ హిట్ కొట్టిన శ్రీ విష్ణు.. మరో డిఫరెంట్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాడు. మొదట్నుంచీ నటనా ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంచుకుంటోన్న శ్రీవిష్ణు.. సక్సెస్ అవుతూ వస్తున్నాడు. తిప్పరా మీసం అంటూ మరో విభిన్న కథా చిత్రంతో త్వరలోనే రానున్నాడు. మందు సిగరెట్ అమ్మాయిల్లా.. శత్రువు కూడా వ్యసనమే.. ఆ వ్యసనానికి నేను కూడా బానిసనే అంటూ మొదలైన ఈ టీజర్ ఆసక్తికరంగా ఉంది. థ్రిల్లర్ మూవీలా కనిపిస్తోన్న ఈ చిత్రంలో శ్రీ విష్ణు లుక్ ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. రిజ్వాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. కృష్ణ విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. -
‘తిప్పరా మీసం’ ఫస్ట్ లుక్ వచ్చేసింది
విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శ్రీవిష్ణు మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాది ఒకే కథ సినిమాలతో మెప్పించిన శ్రీ విష్ణు, ఈసారి రూటు మార్చాడు. యాక్షన్ ఎంటర్టైనర్తో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. అసుర సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ విజయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో నిక్కి తంబోలి హీరోయిన్గా నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతమందిస్తున్న ఈసినిమాకు సిధ్ సినిటోగ్రాఫర్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రిజ్వాన్ నిర్మిస్తున్న ఈ సినిమాను సమ్మర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
‘తిప్పరా మీసం’ అంటున్న యువ హీరో
‘నీదీ నాదీ ఒకే కథ’ అనే సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు శ్రీవిష్ణు. సినీ విశ్లేషకులు ఈ సినిమాకు, సినిమాలోని అతడి నటనకు అద్భుతమైన రివ్యూలు ఇచ్చారు. అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమాలు చేస్తూ వస్తోన్న ఈ యువ హీరో తాజాగా మరో చిత్రాన్ని మొదలుపెట్టారు. శుక్రవారం (జూన్ 22) ఉదయం ఈ కొత్త సినిమాను షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నారా రోహిత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంత్రి కెమెరా స్విచ్చాన్ చేయగా, నారా రోహిత్ క్లాప్ కొట్టారు. ‘తిప్పరా మీసం’ అనే టైటిల్‌కు తగ్గట్టుగా గుబురు గడ్డంతో మాస్‌లుక్‌లోకి మారిపోయారు శ్రీవిష్ణు. ఈ సినిమాకు ‘అసుర’ ఫేం కృష్ణ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడించలేదు. .@sreevishnuoffl's new film #ThipparaMeesam launched today Directed by #KrishnaVijay of #Asura fame. Hero #NaraRohith clapped for first shot. Minister #TalasaniSrinivasYadav switched-on the camera. Produced by #RizwanEntertainment & #ShriOmCinema banners pic.twitter.com/ZXQMIoSB9T — BARaju (@baraju_SuperHit) June 22, 2018