
‘నీదీ నాదీ ఒకే కథ’ అనే సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు శ్రీవిష్ణు. సినీ విశ్లేషకులు ఈ సినిమాకు, సినిమాలోని అతడి నటనకు అద్భుతమైన రివ్యూలు ఇచ్చారు. అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమాలు చేస్తూ వస్తోన్న ఈ యువ హీరో తాజాగా మరో చిత్రాన్ని మొదలుపెట్టారు.
శుక్రవారం (జూన్ 22) ఉదయం ఈ కొత్త సినిమాను షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నారా రోహిత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంత్రి కెమెరా స్విచ్చాన్ చేయగా, నారా రోహిత్ క్లాప్ కొట్టారు. ‘తిప్పరా మీసం’ అనే టైటిల్‌కు తగ్గట్టుగా గుబురు గడ్డంతో మాస్‌లుక్‌లోకి మారిపోయారు శ్రీవిష్ణు. ఈ సినిమాకు ‘అసుర’ ఫేం కృష్ణ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడించలేదు.
.@sreevishnuoffl's new film #ThipparaMeesam launched today
— BARaju (@baraju_SuperHit) June 22, 2018
Directed by #KrishnaVijay of #Asura fame. Hero #NaraRohith clapped for first shot. Minister #TalasaniSrinivasYadav switched-on the camera.
Produced by #RizwanEntertainment & #ShriOmCinema banners pic.twitter.com/ZXQMIoSB9T



Comments
Please login to add a commentAdd a comment