'దోస్త్ అంటే నువ్వేరా.. ఫ్రెండ్ అంటే నువ్వేరా' సాంగ్‌ విన్నారా? | Dosth Ante Nuvvera Song Released From Nachindi Girl Friendu Movie | Sakshi
Sakshi News home page

నచ్చింది గర్ల్‌ఫ్రెండూ నుంచి 'దోస్త్ అంటే నువ్వేరా..' సాంగ్‌ రిలీజ్‌!

Published Mon, Aug 8 2022 8:39 PM | Last Updated on Mon, Aug 8 2022 8:39 PM

Dosth Ante Nuvvera Song Released From Nachindi Girl Friendu Movie - Sakshi

యువ హీరో ఉదయ్ శంకర్ నటిస్తున్న కొత్త సినిమా నచ్చింది గర్ల్ ఫ్రెండూ. జెన్నీ హీరోయిన్‌గా నటిస్తోంది. మధునందన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. కమర్షియల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీని దర్శకుడు గురు పవన్ తెరకెక్కిస్తున్నారు. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్‌పై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్నారు.

ఆదివారం ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి  'దోస్త్ అంటే నువ్వేరా.. ఫ్రెండ్ అంటే నువ్వేరా..' అనే లిరికల్ సాంగ్‌ను నిజజీవితంలో మంచి మిత్రులు అయిన హీరోలు నారా రోహిత్, శ్రీవిష్ణు కలిసి విడుదల చేశారు. ఈ పాటను గిఫ్టన్ ఎలియాస్ స్వరకల్పనలో మున్నా ఎస్డీ సాహిత్యాన్ని అందించగా రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ పాటలో టాలీవుడ్ రియల్ ఫ్రెండ్స్ అయిన ప్రభాస్ గోపీచంద్, పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్, ఎన్టీఆర్ రామ్ చరణ్, మహేష్ బాబు వంశీ పైడిపల్లి ఇలాంటి వారిని చూపిస్తూ స్నేహం గొప్పదనం తెలియజేశారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ.. పాడుతున్న‌ప్పుడే చాలా ఎంజాయ్ చేశాను. దోస్త్‌లందరికీ ఇది ఒక ఆంథ‌మ్ సాంగ్ అవుతుంద‌ని నా న‌మ్మ‌కం.  ఈ పాట నాకు ఇచ్చిన మ్యూజిక్ ద‌ర్శ‌కుడు గిఫ్ట‌న్ కి ద‌ర్శ‌కుడు గురు ప‌వ‌న్ కి థ్యాంక్స్ అన్నారు.

చదవండి: అభిమాని చివరి కోరిక తీర్చిన మెగాస్టార్‌!
'బింబిసార'లో నటించిన ఈ చిన్నారి ఎవరో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement