Arjuna Phalguna Pre Release Event: Dil Raju Comments On Sri Vishnu - Sakshi
Sakshi News home page

ఆ హీరోని ఏమనాలో తెలియడంలేదు: దిల్‌రాజు

Published Fri, Dec 31 2021 12:01 AM | Last Updated on Sat, Jan 1 2022 4:58 AM

Dil Raju Comments On Sri Vishnu Arjuna Phalguna Movie Pre Release Event - Sakshi

‘‘శ్రీ విష్ణును హీరో అనాలో, ఆర్టిస్టు అనాలో నాకు తెలియడంలేదు. కానీ సినిమాను లీడ్‌ చేస్తున్నప్పుడు హీరో అనే అంటాం. జయాపజయాలతో సంబంధం లేకుండా కొత్త దర్శకులకు అవకాశాలను ఇస్తూ నెంబర్‌ ఆఫ్‌ మూవీస్‌ చేస్తున్నాడు శ్రీ విష్ణు. ఏదో ఒక రోజు అతని ప్రయత్నం పెద్దవాడ్ని చేస్తుంది. అయితే తన ప్రయత్నాలను మాత్రం శ్రీ విష్ణు ఆపకూడదు’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. శ్రీ విష్ణు, అమృతా అయ్యర్‌ జంటగా తేజా మార్ని దర్శకత్వంలో నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. ఈ చిత్రం నేడు విడుదలవుతోంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ – ‘‘కొత్త దర్శకులు నాకు కథలు చెప్పినప్పుడు వాటిలో రెండు, మూడు కథలను శ్రీ విష్ణుతో షేర్‌ చేస్తాను. కొత్తవారికి చాన్స్‌  ఇస్తూ డిఫరెంట్‌ సినిమాలు చేస్తున్న నిర్మాతలను అభినందిస్తున్నాను. వీరి ప్రయత్నాలు పెద్ద సక్సెస్‌లు కావాలని కోరుకుంటున్నాను. ‘అర్జున ఫల్గుణ’ పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘ఇండస్ట్రీకి ఉత్తి చేతుల్తో వచ్చాను నేను. ఇప్పుడు చాలా ఆస్తి ఉంది నాకు. నేను పరిచయం చేసిన దర్శకులే నా ఆస్తి. స్నేహితులైన ఐదుగురు అమాయకులు ఓ చిన్న సమస్యలో ఇరుక్కుని ఎలా బయటపడ్డారు? అన్నదే ‘అర్జున ఫల్గుణ’ కథ’’ అన్నారు శ్రీ విష్ణు. ‘‘ఓ వేదికపై మైక్‌ పట్టుకుని నేను మాట్లాడటం ఇదే మొదటిసారి.

కొత్త కొత్త దర్శకులకు శ్రీ విష్ణు ఓ ధైర్యం. ఆయన ఇచ్చిన ధైర్యమే నన్ను ఇక్కడివరకు తీసుకువచ్చింది’’ అన్నారు తేజ మార్ని. ‘‘శ్రీ విష్ణు చేసిన 15 చిత్రాల్లో పదిమంది కొత్త దర్శకులే’’ అన్నారు దర్శకుడు కిశోర్‌ తిరుమల. ‘‘చాలామంది దర్శకులను పరిచయం చేసిన శ్రీ విష్ణును నేను ఇండస్ట్రీకి పరిచయం చేసినందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు నిర్మాత బెక్కం వేణుగోపాల్‌. ఈ కార్యక్రమంలో దర్శకులు వివేక్‌ ఆత్రేయ, సాగర్‌ చంద్ర, వెంకటేశ్‌ మహా, మ్యూజిక్‌ డైరెక్టర్‌ ప్రియదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement