
‘దిల్’ రాజు, శిరీష్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, పరశురామ్
– విజయ్ దేవరకొండ
‘‘నా సినిమా వంద కోట్ల రూపాయల వసూళ్లు సాధించాలనే నా కల నా నాలుగో సినిమా ‘గీత గోవిందం’తో నిజమైంది. ఆ తర్వాత అలాంటి మూవీ నాకు దక్కలేదు. అనంతరం నేను నటించిన మరో సినిమా రెండు వందల కోట్ల వసూళ్లు సాధిస్తుందని చెప్పాను... కానీ, సాధించలేదు. కానీ ఎవరు ఎన్ని అనుకున్నా రెండు వందల కోట్ల రూపాయల వసూళ్ల సినిమా చేస్తాను. ఇది బలుపు, అహంకారం అనుకున్నా సరే.. కానీ ఇది నా మీద నాకున్న నమ్మకం, విశ్వాసం.
ఇక ఈ సమ్మర్‌కు మా టీమ్ నుంచి మీకు ఇస్తున్న చిన్న గిఫ్ట్ ‘ఫ్యామిలీ స్టార్’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘మన కుటుంబంలోని భావోద్వేగాలతో రూపొందిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’’ అన్నారు. ‘‘మా సినిమా కథలోని భావోద్వేగాలకు అందరూ కనెక్ట్ అవుతారు’’ అన్నారు పరశురామ్ పెట్ల.
Comments
Please login to add a commentAdd a comment