ఒక్కడే ఉండేవాడట! | Appatlo Okadundevaadu Movie | Sakshi
Sakshi News home page

ఒక్కడే ఉండేవాడట!

Published Tue, Jul 26 2016 12:03 AM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM

ఒక్కడే ఉండేవాడట!

ఒక్కడే ఉండేవాడట!

 నారా రోహిత్, శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘అప్పట్లో ఒకడుండేవాడు’. తానియా హోప్ కథానాయికగా నటిస్తున్నారు. రోహిత్ సమర్పణలో ఆరన్ మీడియా వర్క్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘అయ్యారే’ ఫేమ్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాయి కార్తీక్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను త్వరలో విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రశాంతి, కృష్ణ విజయ్ తెలిపారు. ‘‘ఇది మంచి మాస్ ఎంటర్‌టైనర్. ఇందులో నారా రోహిత్ కొత్తగా కనిపిస్తారు. ఆయన పాత్ర కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి కూర్పు: కోటగిరి వెంక టేశ్వరరావు, కెమేరా: నవీన్ యాదవ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement