ప్రియదర్శి
‘‘నటుడిగా ఉంటే విభిన్నరకాలైన పాత్రలు చేయవచ్చు. అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి. ఇలా కాకుండా నన్ను నేను ఓ హీరోగా అనుకుంటే ఓ డిఫరెంట్ ఇమేజ్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఆ ఇమేజ్ అంటే నాకు భయం. ‘మల్లేశం’ సినిమా తర్వాత నేను దాదాపు 40 కథలు విన్నాను. ఈ కథల్లో ఓ నటుడిగా నన్ను నేను ఊహించుకోలేకపోయాను. దీంతో ‘జాతిరత్నాలు’ సినిమాలో నటించాను. ‘మంగళవారం’ సినిమాలో కూడా నాది హీరో రోల్ అనుకోవడం లేదు.
దర్శక–నిర్మాతలు డిఫరెంట్ రోల్స్ ఇస్తున్నారంటే నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని ప్రియదర్శి అన్నారు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో హర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఓం భీమ్ బుష్’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వీ సెల్యులాయిడ్, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ప్రియదర్శి మాట్లాడుతూ– ‘‘ముగ్గురు పీహెచ్‌డీ స్కాలర్స్ కథే ఈ చిత్రం. ఓ మంచి పాయింట్‌ను టచ్ చేశాం. ప్రస్తుతం‘గేమ్‌చేంజర్’ మూవీలో ఓ పాత్ర చేస్తున్నాను. నేను, నభానటేష్ లీడ్స్‌గా ఓ మూవీ చేస్తున్నాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment