‘‘నా సినిమాలకు పెట్టుబడి పెట్టే నిర్మాతలు నష్టపోకూడదని కోరుకుంటాను. ఇండస్ట్రీలో నా మార్కెట్ పెరగడం, తగ్గడం అనేది నా చేతుల్లో లేని విషయం. ఏ సినిమా వల్ల మార్కెట్ పెరుగుతుందో, ఏ సినిమా వల్ల తగ్గుతుందో గ్యారెంటీగా చెప్పలేం’’ అని శ్రీవిష్ణు అన్నారు. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’.
శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీ విష్ణు మాట్లాడుతూ– ‘‘సైంటిస్ట్‌లు కావాలని ఉస్మానియా యూనివర్సిటీలో చాలా కాలంగా తిష్ట వేసిన ఓ ముగ్గురు పీహెచ్‌డీ స్కాలర్స్‌ను అక్కడి విద్యార్థులు ఓ స్కెచ్ వేసి బయటకు పంపిస్తారు. అలా బయటకు వచ్చిన ఆ ముగ్గురు భైరవపురం అనే ఊరికి వెళ్లినప్పుడు అక్కడ ఏం జరిగింది? ఈ ముగ్గురి నిధి అన్వేషణ ఫలించిందా? లేదా అన్నది ‘ఓం భీమ్ బుష్’ కథాంశం.
అలాగే ఈ మూవీలో కొత్త పాయింట్‌ని టచ్ చేశాం. ఆ అంశం నాకు కిక్ ఇచ్చింది. ఈ మూవీలో ఆయేషా ఖాన్ స్పెషల్ సాంగ్ చేసింది. తనకు బిగ్‌బాస్ ఆఫర్ వచ్చిన విషయం మాతో చెప్పకుండా వెళ్లిపోయింది. తన వల్ల కొన్నాళ్లు షూటింగ్ ఆలస్యమైంది. నా తర్వాతి చిత్రం ‘స్వాగ్’ పూర్తి కావొచ్చింది. గీతా ఆర్ట్స్, కోనగారితో సినిమాలు కమిటయ్యాను. అలాగే ఓ థ్రిల్లర్ ఫిల్మ్ కూడా ఉంది’’ అన్నారు.
చదవండి: జపాన్‌లో భూకంపం.. రాజమౌళి కుటుంబానికి తప్పిన ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment