ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. అవి మాత్రం డోంట్ మిస్ | Upcoming Telugu Movies OTT Release On March 3rd Week 2024 | Sakshi
Sakshi News home page

This Week OTT Movies: ఓటీటీల్లోకి ఏకంగా 20 మూవీస్.. ఎందులో ఏ సినిమా?

Published Mon, Mar 18 2024 8:06 AM | Last Updated on Mon, Mar 18 2024 8:41 AM

Upcoming OTT Released Movies Telugu March 3rd Week 2024 - Sakshi

మరో వారం వచ్చేసింది. ప్రస్తుతం పరీక్షల కాలం నడుస్తుండటం వల్ల థియేటర్లలోకి పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేం రావట్లేదు. ఉన్నవాటిలో 'ఓం భీమ్ బుష్' కాస్త ఆసక్తికరంగా అనిపిస్తోంది. లాజిక్స్ కంటే కామెడీని నమ్ముకున్న ఈ చిత్రం ఏ మేరకు హిట్ అవుతుందో చూడాలి. మరోవైపు ఓటీటీలో కూడా ప్రస్తుతం 'హనుమాన్' హవా నడుస్తోంది. అలానే ఈ వారమైతే తెలుగు స్ట్రెయిట్ మూవీస్ ఏం లేవు. కానీ పలు డబ్బింగ్ చిత్రాలు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి.

(ఇదీ చదవండి: సింపుల్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ లేడీ సింగర్)

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ఈసారి ఏడు ఆస్కార్స్ గెలుచుకున్న 'ఓపెన్ హైమర్'.. ఈ వారమే తెలుగు స్ట్రీమింగ్ కానుంది. అలానే 'అబ్రహం ఓజ్లర్' అనే హిట్ మూవీ కూడా రానుంది. వీటితోపాటు 'ఏ వతన్ మేరే వతన్', 'ఫైటర్' లాంటి హిందీ చిత్రాలు కూడా డిజిటల్ రిలీజ్‌కి సిద్ధమైపోయాయి. అలానే పలు హిందీ-ఇంగ్లీష్ సినిమాలు-వెబ్ సిరీసులు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. ఇంతకీ అవేంటంటే?

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ జాబితా (మార్చి 18 నుంచి 24 వరకు)

నెట్‌ఫ్లిక్స్

  • యంగ్ రాయల్స్ ఫరెవర్ (స్వీడిష్ సినిమా) - మార్చి 18
  • 3 బాడీ ప్రాబ్లమ్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 21
  • ఫైటర్ (హిందీ మూవీ) - మార్చి 21 (రూమర్ డేట్)
  • బైయింగ్ బేవర్లీ హిల్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 22
  • షిర్లే (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 22
  • ద కసగ్రెనేడ్స్ మూవీ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 22

హాట్‌స్టార్

  • అబ్రహం ఓజ్లర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 20
  • సాండ్ ల్యాండ్: ద సిరీస్ (జపనీస్ సిరీస్) - మార్చి 20
  • ఎక్స్-మ్యాన్ '97 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 20
  • అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 22
  • డేవీ & జాన్సీస్ లాకర్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 22
  • లూటేరే (హిందీ సిరీస్) - మార్చి 22
  • ఫొటోగ్రాఫర్ సీజన్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 24

అమెజాన్ ప్రైమ్

  • మరక్కుమ నెంజమ్ (తమిళ మూవీ) - మార్చి 19
  • ఏ వతన్ మేరే వతన్ (హిందీ సినిమా) - మార్చి 21
  • రోడ్ హౌస్ (ఇంగ్లీష్ చిత్రం) - మార్చి 21

జియో సినిమా

  • ఓపెన్ హైమర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 21

బుక్ మై షో

  • ఫ్రూయడ్స్ లాస్ట్ సెషన్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 19

ఆపిల్ ప్లస్ టీవీ

  • పామ్ రాయల్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 20
  • ఆర్గిల్లీ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 23

(ఇదీ చదవండి: Priyanka Chopra: ఒక్క నెక్లెస్.. ఏకంగా అన్ని కోట్లు.. ఏంటంత స్పెషల్?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement