ప్రముఖ హిందీ నటుడు అనుపమ్ ఖేర్ ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రంలో కీలక పాత్ర అంగీకరించారు. రవితేజ టైటిల్ రోల్‌లో తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ‘ది కశ్మీరీ ఫైల్స్’లో అనుపమ్ చేసిన పుష్కర్ నాథ్ పండిట్ పాత్ర సినిమాకి హైలైట్‌గా నిలిచింది. మళ్లీ అభిషేక్ నిర్మాణంలో మరో సినిమా చేయనుండటం పట్ల అనుపమ్ ఆనందం వ్యక్తం చేశారు.
స్టువర్ట్‌పురం దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌గా 1970 నేపథ్యంలో రూపొందుతోన్న ‘టైగర్ నాగేశ్వరరావు’లో రవితేజ సరసన నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వంశీ దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఇదే కాదు.. నిఖిల్ ‘కార్తికేయ 2’లోనూ అనుపమ్ కీలక పాత్ర చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment