నైట్‌ షూట్‌లో నాగేశ్వరరావు | Ravi Teja Tiger Nageswara Rao Starts Night Shoot | Sakshi
Sakshi News home page

నైట్‌ షూట్‌లో నాగేశ్వరరావు

Published Thu, Jun 9 2022 5:20 AM | Last Updated on Thu, Jun 9 2022 5:20 AM

Ravi Teja Tiger Nageswara Rao Starts Night Shoot - Sakshi

దొంగతనాలు ఎలా చేయాలో నేర్చుకుంటున్నారు రవితేజ. ఈ మెళకువలన్నీ ‘టైగర్‌ నాగేశ్వరరావు’ సినిమా కోసమే. స్టూవర్టుపురం దొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవితం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో నాగేశ్వరరావు పాత్రను రవితేజ చేస్తున్నారు. ఈ పాత్ర కోసం తన బాడీ లాంగ్వేజ్‌ని మార్చుకున్నారు. అలాగే సంభాషణలు పలికే తీరు కూడా వినూత్నంగా ఉంటుంది.

రవితేజ నటిస్తున్న ఈ తొలి పాన్‌ ఇండియా చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నైట్‌ షూట్‌ జరుగుతోంది. ఈ సెట్‌లో జరుగుతున్న సందడి తాలూకు వీడియోను రవితేజ షేర్‌ చేశారు. నాగేశ్వరరావు రాత్రిపూట చేసే దొంగతనానికి సంబంధించిన సీన్స్‌ని చిత్రీకరిస్తున్నారని సమాచారం. రవితేజ సరసన నూపుర్‌ సనన్, గాయత్రీ భరద్వాజ్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మాత.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement