సినీ పరిశ్రమలో ప్రస్తుతం బయోపిక్‌ల హవా నడుస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో బయోపిక్ తెరపైకి వచ్చింది. భారతరత్న అవార్డు గ్రహీత, భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త మౌలానా అబ్దుల్‌కలాం ఆజాద్ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. డ్రీమ్ మర్చెంట్స్ ఐఎన్‌సీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకేఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర, అభిషేక్ అగర్వాల్ ఈ బయోపిక్‌ను నిర్మించనున్నారు. ‘‘కలాంగారి నేతృత్వంలో 11 మే 1998లో న్యూక్లియర్ పవర్ టెస్టు సక్సెస్ అయ్యింది.
ఆయన బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నాం అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం. ప్రతి కథలో ఓ హీరో ఉంటాడు’’ అని నిర్మాత అభిషేక్ అగర్వాల్ ట్వీటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 1931లో తమిళనాడులోని రామేశ్వరంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన ఎన్నో కష్టాలను ఎదర్కొని జీవితంలో అత్యున్నత శిఖరాలకు చేరుకున్నారు. 2015లో కలాం కన్నుమూసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment