Ramabrahmam Sunkara
-
ఒక సామాన్యుడి ఘర్షణ
సందీప్ కిషన్ హీరోగా సోమవారం కొత్త చిత్రం ఆరంభమైంది. సందీప్ కిషన్‌తో త్వరలో రిలీజ్‌కు రెడీ కానున్న ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రం రూ΄÷ందించిన ఏకే ఎంటర్టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని కూడా నిర్మించనుంది. ‘మాయవన్’ చిత్రం తర్వాత సందీప్ కిషన్, దర్శకుడు సీవీ కుమార్ కాంబినేషన్లో ‘మాయవన్’కి సీక్వెల్‌గా ఈ చిత్రం రూ΄÷ందనుంది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి వెంకట్ బోయనపల్లి కెమెరా స్విచాన్ చేయగా, దామోదర్ ప్రసాద్ క్లాప్ ఇచ్చారు. పి. కిరణ్ దర్శకత్వం వహించారు. ‘‘ఒక సూపర్ విలన్‌తో ఓ సామాన్యుడి ఘర్షణ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. రెగ్యులర్ షూటింగ్‌ని నవంబర్‌లో ఆరంభిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: కార్తీక్ కె. తిల్లై, ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్: కిషోర్ గరికి΄ాటి (జీకే). -
ఎనిమిదేళ్ల తర్వాత ‘మహాసముద్రం’..
‘‘ఎనిమిదేళ్ల తర్వాత ‘మహాసముద్రం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు రీ ఎంట్రీ ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమాకి ఈ నెల నుంచి పని చేయబోతున్నాను.. చెప్పినట్లుగానే నేను తిరిగి వస్తున్నాను. ఒక గొప్ప టీమ్‌తో, గొప్ప సహనటీనటులతో పని చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు సిద్ధార్థ్. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మహాసముద్రం’. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా అదితీరావ్ హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. -
ఏ మలుపు ఎప్పుడొస్తుందో చెప్పలేం
‘‘చాణక్య’ సినిమా చాలా బాగా వచ్చింది. తొలిసారి గూఢచారి పాత్ర చేశా. ఈ సినిమాలో వినోదం, భావోద్వేగాలు, యాక్షన్.. అన్నీ సమపాళ్లలో ఉంటాయి. తప్పకుండా ప్రేక్షకుల అంచనాలను చేరుకుంటాం’’ అన్నారు గోపీచంద్. తిరు దర్శకత్వంలో గోపీచంద్, మెహరీన్ జంటగా నటించిన చిత్రం ‘చాణక్య’. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గోపీచంద్ చెప్పిన విశేషాలు. ► తిరు చెప్పిన ‘చాణక్య’ స్టోరీ చాలా ఆసక్తిగా అనిపించింది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకూ ప్రేక్షకులకు తర్వాత ఏం జరుగుతుందనే ఎగై్జట్‌మెంట్‌తో పాటు టెన్షన్ ఉంటుంది. ఇందులో ఎంటర్టైనింగ్ లవ్ ట్రాక్ కూడా ఉంటుంది. మాస్, క్లాస్.. ఏ జోనర్ అయినా యాక్షన్ కామనే. ఇందులో మంచి యాక్షన్ ఉంది. మంచి సినిమా తీశామని యూనిట్ అంతా సంతోషంగా ఉన్నాం. ► ఈ సినిమాలో నా లుక్ చాలా కొత్తగా ఉంటుంది. కెమెరామేన్ వెట్రి పళనిస్వామి నన్ను చాలా అందంగా చూపించారు. మంచి విజువల్స్ ఇచ్చారు. ‘గౌతమ్ నంద’లో గెడ్డంతో కనిపించినా, ‘చాణక్య’లో మాత్రం వేరే స్టైల్ గెడ్డంతో ఉంటా. సరదాగా నేను గెడ్డం పెంచాను. ఈ లుక్ చాలా బాగుందని తిరు చెప్పడంతో అదే కంటిన్యూ చేశాను. స్పై ఏజెంట్స్ జీవితం ఎలా ఉంటుంది? అనే నేపథ్యంలో కథ ఉంటుంది. గతంలో వచ్చిన గూఢచారి సినిమాలకు భిన్నంగా ఉంటుంది. ఇందులో నా పాత్ర పేరు అర్జున్. రెండు షేడ్స్ ఉంటాయి. ► మాకు బాగా దగ్గరైన వారికి ‘చాణక్య’ ప్రివ్యూ వేశాం. వారంతా సినిమా చాలా బాగుందన్నారు. సినిమా చూశాక ప్రేక్షకుల నుంచి కూడా ఇదే మాట వస్తుందనే నమ్మకం ఉంది. విదేశాల్లో ఉండటం వల్ల ఈ సినిమాని నా ఫ్రెండ్ ప్రభాస్ చూడలేదు. నా నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ► ‘చాణక్య’ సినిమాని మేలో విడుదల చేయాలనుకున్నాం. అయితే చివరి రోజు షూటింగ్లో బైక్ స్కిట్ అవడంతో నాకు బాగా గాయాలయ్యాయి. దాంతో షూటింగ్ ఆగిపోయి, విడుదలకు మూడు నెలలు ఆలస్యం అయింది. ‘సైరా’ ప్యాన్ ఇండియన్ సినిమానే. అయితే దసరా పండగ సమయం కావడంతో రెండు మూడు సినిమాలు ఆడేందుకు అవకాశం ఉంటుంది. అందుకే మా చిత్రం కూడా విడుదల చేస్తున్నాం. ► నాకు కొంచెం సిగ్గెక్కువ. అందుకే సెట్స్‌లో త్వరగా ఎవరితోనూ మాట్లాడను. అది హీరోయిన్ అయినా? ఎవరైనా సరే. మన కెరీర్లో ఏ సినిమా ఏ మలుపు తిప్పుతుందో ఎవరికీ తెలియదు. మా వరకూ కష్టపడి మంచి సినిమా చేస్తాం. విజయాన్ని నిర్ణయించేది ప్రేక్షకులే. అయితే నా కెరీర్‌కి ‘చాణక్య’ సినిమా ప్లస్ అవుతుందని మాత్రం కచ్చితంగా చెప్పగలను. అందులో ఎటువంటి అనుమానం లేదు. ► మా సినిమాకి నేపథ్య సంగీతం వెన్నెముకలాంటిది. చక్కగా కుదిరింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్‌లోని డైలాగులకు మంచి స్పందన వస్తోంది. సినిమాలోనూ చాలా మంచి డైలాగులున్నాయి. నా కెరీర్లో చాలా మంది తమిళ డైరెక్టర్స్‌తో సినిమాలు చేశా. నాకు కథ ముఖ్యం.. భాష కాదు. డైరెక్టర్ తిరు మంచి ప్రతిభావంతుడు. తెలుగు నుంచి వెళ్లి తమిళ్లో సెటిల్ అయ్యాడు. తనతో పని చేయడం సౌకర్యంగానే అనిపించింది. అనిల్ సుంకరగారు ప్యాషనేట్ నిర్మాత. ప్రేక్షకులకు ఇంకా బాగా ఏం ఇవ్వగలం? అని ప్రతిరోజూ ఆలోచిస్తుంటారాయన. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం. ► మీరు ప్యాన్ ఇండియన్ సినిమా ఎప్పుడు చేస్తున్నారు? అనే ప్రశ్నకు గోపీచంద్ బదులిస్తూ.. ‘తెలుగులో ప్యాన్ ఇండియన్ సినిమాలకు ఈ మధ్యే గేట్లు తెరుచుకున్నాయి. నిజంగా ఇది చాలా సంతోషం. సమయం వచ్చినప్పుడు చేద్దాం (నవ్వుతూ)’ అన్నారు. ప్రస్తుతం బిను సుబ్ర మణ్యం దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్‌గారి బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నా. అది పూర్తయ్యాకే సంపత్ నంది సినిమా మొదలవుతుంది. ఈ రెండూ మంచి కథలే. -
తెరపైకి కలాం జీవితం
సినీ పరిశ్రమలో ప్రస్తుతం బయోపిక్‌ల హవా నడుస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో బయోపిక్ తెరపైకి వచ్చింది. భారతరత్న అవార్డు గ్రహీత, భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త మౌలానా అబ్దుల్‌కలాం ఆజాద్ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. డ్రీమ్ మర్చెంట్స్ ఐఎన్‌సీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకేఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర, అభిషేక్ అగర్వాల్ ఈ బయోపిక్‌ను నిర్మించనున్నారు. ‘‘కలాంగారి నేతృత్వంలో 11 మే 1998లో న్యూక్లియర్ పవర్ టెస్టు సక్సెస్ అయ్యింది. ఆయన బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నాం అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం. ప్రతి కథలో ఓ హీరో ఉంటాడు’’ అని నిర్మాత అభిషేక్ అగర్వాల్ ట్వీటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 1931లో తమిళనాడులోని రామేశ్వరంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన ఎన్నో కష్టాలను ఎదర్కొని జీవితంలో అత్యున్నత శిఖరాలకు చేరుకున్నారు. 2015లో కలాం కన్నుమూసిన సంగతి తెలిసిందే. -
మళ్లీ యాక్షన్
హాటైన ఎండలకు దీటుగా విలన్స్‌ను ఇరగ్గొట్టడానికి గోపీచంద్ రెడీ అవుతున్నారు. గోపీచంద్ హీరోగా తమిళ దర్శకుడు తిరు ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రామబ్రహ్మం సుంకర నిర్మాత. ఇటీవల రాజస్తాన్‌లో మొదలైన ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్లో ఓ యాక్షన్ ఎపిసోడ్లో భాగంగా గోపీచంద్ గాయపడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు గోపీచంద్. ఈ సినిమా షూటింగ్ తిరిగి మే రెండో వారంలో ప్రారంభం కానుందని తెలిసింది. ఆడియన్స్‌కి నచ్చేలా గోపీచంద్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్లు యాక్షన్ సన్నివేశాలను ప్లాన్ చేస్తున్నారట యాక్షన్ కొరియోగ్రాఫర్ సెల్వ. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. అబ్బూరి రవి మాటలు రాస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... గోపీచంద్ నెక్ట్స్ చిత్రం గురించి అతి త్వరలో ఓ అనౌన్స్మెంట్ వస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. -
ఒక్క సినిమా... ముగ్గురు దర్శకులు
నిఖిల్ కొత్త సినిమాకు ముగ్గురు దర్శకులు పని చేస్తున్నారు. అయితే... ముగ్గురూ దర్శకత్వం వహించడం లేదు. ఒకరు మాటలు రాస్తుంటే, మరొకరు స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఇంకొకరు దర్శకుడు. నిఖిల్ హీరోగా శరణ్ కొప్పిశెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఏకే ఎంటర్టైన్మెంట్స్పై రామబ్రహ్మం సుంకర ఓ సినిమా నిర్మించనున్నారు. నిఖిల్‌తో ‘స్వామి రారా, కేశవ’ వంటి హిట్స్ తీసిన దర్శకుడు సుధీర్ వర్మ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే రైటర్. నిఖిల్ ‘కార్తికేయ’ దర్శకుడు చందూ మొండేటి డైలాగ్ రైటర్. ‘‘ఈ సినిమాలో 18 నుంచి 30 ఏళ్లలోపు అబ్బాయిలు ఎనిమిది మంది, అమ్మాయిలు ముగ్గురు కీలక పాత్రలు చేయనున్నారు. వాళ్ల కోసం కాస్టింగ్ కాల్ ఇచ్చాం’’ అన్నారు రామబ్రహ్మం సుంకర. ఈ చిత్రానికి సంగీతం: అజనీశ్ లోక్‌నాథ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిశోర్ గరికిపాటి, సహ–నిర్మాతలు: అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్.