మళ్లీ యాక్షన్‌ | may second week starts shooting on gopichand new movie | Sakshi
Sakshi News home page

మళ్లీ యాక్షన్‌

Published Wed, Mar 27 2019 12:28 AM | Last Updated on Wed, Mar 27 2019 12:28 AM

may second week starts shooting on gopichand new movie - Sakshi

గోపీచంద్‌

హాటైన ఎండలకు దీటుగా విలన్స్‌ను ఇరగ్గొట్టడానికి గోపీచంద్‌ రెడీ అవుతున్నారు. గోపీచంద్‌ హీరోగా తమిళ దర్శకుడు తిరు ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రామబ్రహ్మం సుంకర నిర్మాత. ఇటీవల రాజస్తాన్‌లో మొదలైన ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌లో ఓ యాక్షన్‌ ఎపిసోడ్‌లో భాగంగా గోపీచంద్‌ గాయపడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు గోపీచంద్‌.

ఈ సినిమా షూటింగ్‌ తిరిగి మే రెండో వారంలో ప్రారంభం కానుందని తెలిసింది. ఆడియన్స్‌కి నచ్చేలా గోపీచంద్‌ మాస్‌ ఇమేజ్‌కు తగ్గట్లు యాక్షన్‌ సన్నివేశాలను ప్లాన్‌ చేస్తున్నారట యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ సెల్వ. ఈ చిత్రానికి విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్నారు. అబ్బూరి రవి మాటలు రాస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... గోపీచంద్‌ నెక్ట్స్‌ చిత్రం గురించి అతి త్వరలో ఓ అనౌన్స్‌మెంట్‌ వస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement