ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన హిందీ చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. కశ్మీర్ పండిట్ల ఊచకోత నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా రూ. 340 కోట్లు వసూళు చేసి రికార్డు సృష్టించింది. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నీహోత్రి దర్శకత్వం వహించగా.. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీతో ఒక్కసారిగా సంచలనంగా మారిన ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది.
చదవండి: తన స్థానంలోకి కొత్త యాంకర్ ఎంట్రీ.. స్పందించిన రష్మీ గౌతమ్
మరో యథార్థ సంఘటనతో ‘ది కశ్మీర్ ఫైల్స్’ టీం రెడీ అయింది. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దీనికి సంబంధించిన ప్రకటనను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. తాజాగా ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ట్విటర్ వేదికగా రిలీజ్ చేశాడు. ఈ సినిమాకు ‘ది వ్యాక్సిన్ వార్’ అని టైటిల్‌ను ఖారారు చేసి ఈ సినిమా దాదాపు 11 భాషల్లో విడుదల చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించాడు. దీంతో ఈ సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ANNOUNCEMENT:
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) November 10, 2022
Presenting ‘THE VACCINE WAR’ - an incredible true story of a war that you didn’t know India fought. And won with its science, courage & great Indian values.
It will release on Independence Day, 2023. In 11 languages.
Please bless us.#TheVaccineWar pic.twitter.com/T4MGQwKBMg
Comments
Please login to add a commentAdd a comment