ఓటీటీకి వివేక్ అగ్నిహోత్రి మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Vivek Agnihotri Latest Movie The Vaccine War Ready To Streaming In Ott | Sakshi
Sakshi News home page

The Vaccine War: ఓటీటీలో 'ది వ్యాక్సిన్ వార్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published Thu, Nov 23 2023 9:09 PM | Last Updated on Fri, Nov 24 2023 9:20 AM

Vivek Agnihotri Latest Movie The Vaccine War Ready To Streaming In Ott - Sakshi

ది కశ్మీర్‌ ఫైల్స్‌ మూవీతో హిట్‌ కొట్టిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. కశ్మీర్ పండితుల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అదే జోరుతో  వివేక్‌  ది వ్యాక్సిన్‌ వార్‌ చిత్రాన్ని రూపొందించారు. ఈ ఏడాది సెప్టెంబరు 28 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది. కొవిడ్ టైంలో వ్యాక్సిన్‌ను శాస్త్రవేత్తలు ఎలా అభివృద్ధి చేశారనేది ఈ చిత్రంలో చూపించారు. 

అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈనెల 24న తేదీ నుంచే స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ప్రస్తుతం ఈ మూవీ హిందీలో మాత్రమే అందుబాటులో ఉండనుంది. దక్షిణాది భాషల్లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని మేకర్స్ వెల్లడించలేదు. కాగా.. ఈ చిత్రంలో అనుపమ్‌ ఖేర్‌, నానా పటేకర్‌, పల్లవి జోషి కీలక పాత్రల్లో నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement