
అభిషేక్ అగర్వాల్, వివేక్ అగ్నిహోత్రి
కాశ్మీర్ వ్యాలీ చరిత్రలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలతో రూపొందనున్న చిత్రం ‘కాశ్మీర్ ఫైల్స్’. ‘ది తాష్కెంట్ ఫైల్స్’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వివేక్ అగ్నిహోత్రి ఈ చిత్రానికి దర్శకుడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని హిందీలో నిర్మించనున్నారు. అభిషేక్ మాట్లాడుతూ– ‘‘ఆర్టికల్ 370 చుట్టూ అల్లిన కథతో ఈ చారిత్రాత్మక సినిమా ఉంటుంది. ఆర్టికల్ 370 ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు రద్దు చేశారు? అనే కారణాలను మా చిత్రంలో చూపించబోతున్నాం. ఈ చరిత్రలో భాగమైన ఎంతోమంది లెజెండ్స్ పాత్రల్లో ప్రముఖ నటులు నటిస్తారు. ఆ వివ రాలు త్వరలోనే తెలియజేస్తాం. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 14, 2020న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment