
యువ కథానాయకుడు బెల్లకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లో జోరు పెంచారు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఓ సినిమా, శ్రీనివాస్ దర్శకునిగా పరిచయం అవుతున్న మరో సినిమాలో హీరోగా నటిస్తున్నారు శ్రీనివాస్. తాజాగా ఆయన రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ‘‘ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. మేజర్ షూటింగ్ విదేశాల్లో ప్లాన్ చేశాం. లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందననున్న ఈ సినిమాలో నటించనున్న ఇతర తారాగణం వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అని పేర్కొంది చిత్రబృందం.
Comments
Please login to add a commentAdd a comment