కొండలాంటి పొట్టను కరిగించుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారా? ఎంత కష్టపడినా బెల్లీ ఫ్యాట్ తగ్గడంలేదని ఆందోళనలో ఉన్నారా? మరి అలాంటివారికి చక్కగా ఉపయోగపడే పురాతన యుద్ధ కళలు, ఫిట్‌నెస్‌కు పెట్టింది పేరైన జపాన్‌లో ఆచరించే కొన్ని వర్కౌట్స్ గురించి తెలుసు కుందాం రండి!
ఆహార అలవాట్లలో మార్పులతోపాటు కొన్ని జపనీస్ వ్యాయామాలు బెల్లీ ఫ్యాట్‌ను కరిగించు కునేందుకు, బాడీ ఫిట్‌గా ఉండేందుకు ఉపకరిస్తాయి.
సుమో స్క్వాట్స్
జపనీస్ ప్రొఫెషనల్ రెజ్లర్‌ల మ్యాచ్‌కు ముందు పొట్ట, తొడలపై భారం పడేలా కొన్ని భంగిమలను ప్రదిర్శిస్తారు. దాదాపు అలాంటివే ఈ సుమో స్క్వాట్స్
పాదాలను వెడల్పుగా చాచి,నడుముపై భారం వేసి, భుజాలను స్ట్రెచ్ చేసి, రెండు చేతులను దగ్గరగా చేర్చి నమస్కారం పెడుతున్న ఫోజులో నిలబడాలి. ఇపుడు, పొత్తికడుపు, కాలి కండరాలపై భార పడుతుంది. ఈ భంగిమలో కనీసం 30 సెకన్ల పాటు నిలబడి, తిరిగి యథాస్థితిలోకి రావాలి.
తెనుగుయ్ టైడో (టవల్ స్వింగ్స్)
అత్యంత ప్రభావవంతమైన, సులభంగా నిర్వహించగల జపనీస్ వ్యాయామాలలో ఒకటి, టవల్ స్వింగ్‌లు కడుపు, పొత్తికడుపు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. కండరాలను బలపరుస్తాయి.
పాదాలను వెడల్పుగా ఉంచి, భుజాలు స్ట్రెచ్‌అయ్యేలా చేతులను వెడల్పుగా చాచి నిల బడాలి. ఇపుడు రెండు చేతలుతో ఒక టవల్‌ను రెండు వైపులా పట్టుకొని స్వింగ్ చేయాలి. కనీసం 2 నిమిషాలు చేయాలి. సౌలభ్యాన్ని ఈ సమయాన్ని పెంచుకోవచ్చు.
రేడియో టైసో..
కాళ్లు, చేతులు వేగంగా కదిలిస్తూ, శరీరాన్ని ముందుకు, వెనక్కి వంచుతూ వ్యాయామాలు చేస్తారు. ఇవి వివధ శరీర భాగాల్లోనే కాకుండా పొట్ట, నడుము చుట్టు ఉండే కొవ్వును అద్భుతంగా కరిగిస్తాయి.
లంగ్ అంట్ టో టచ్
కుడి కాలిని మడిచి, ఎడమ కాలిని సాధ్యమైనంత ముందుకు చాపాలి. కుడిచేత్తో కుడి కాలి తొడమీద సపోర్టు తీసుకుని, నడుమును వంచి ఎడమచేతితో ఎడమ కాలి బొటన వేలి తాకాలి. ఇలా విరామం తీసుకుంటూ ఇలా రెండువైపులా చేయాలి.
హూలాహూప్
నడుము చుట్టూ ఒక పెద్ద రింగ్ ధరించి హూలాహూప్ వర్కౌవుట్ చేస్తారు. పొట్ట భాగంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. కాళ్లు, చేతులు, కోర్ కండరాలు ధృడంగా తయారవుతాయి.
నోట్: క్రమం తప్పని వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు ఆరోగ్యానికి మేలు చేయడం కాదు. శరీరం సమతుల్యంగా, ఫిట్‌గా ఉండటానికి కూడా దోహదం చేస్తాయి. ఇండోర్ వర్కౌట్స్, ఔట్‌డోర్ వర్కౌట్స్‌తో కొవ్వులను సులభంగా కరిగించుకోవచ్చు. అయితే కొంత మందికి కొన్ని ఆరోగ్య పరిస్థితులు, వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలు, జీవనశైలిగా కారణంగా అనుకున్నంత సులువు కాకపోవచ్చు. దీనికి వైద్య నిపుణుల సలహాలను తీసుకోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment