ఇన్నాళ్లుగా అనుకున్నట్లుగా ఒబెసిటీ అంటే అది కాదట. దశాబ్దాలు అలానే తప్పుగా భావించమని తేల్చి చెప్పారు వైద్యులు. అసలు ఒబెసిటీ అంటే ఏంటో..అందుకు సంబంధించిన సరికొత్త మార్గదర్శకాలను అందించారు నిపుణులు. మరీ ఒబెసిటీ అంటే ఏంటంటే..
దశాబ్దాలుగా వైద్యులు ఊబకాయాన్ని(obesity) కొలవడానికి బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ)(body mass index (BMI))సాధనంగా ఉపయోగిస్తున్నారు. ఇక్కడ బీఎంఐ అనేది వ్యక్తి బరువును కిలోగ్రాముల్లోనూ, ఎత్తు చదరుపు మీటర్లలో భాగించగా వచ్చిన దాన్ని శరీర కొవ్వు కొలతగా నిర్వచించేవారు.
దీంతో బీఎంఐ 30 కంటే ఎక్కువ ఉంటే ఊబకాయంగా పరిగణించారు. అయితే కొందరిలో మాత్రం అధిక శరీర కొవ్వు ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ 30 కంటే ఎక్కువ బీఎం ఉండదు. అలాంటప్పుడూ రాబోయే ఆరోగ్య ప్రమాదాలు గుర్తించలేమని వైద్యులు చెబుతున్నారు. అదీగాక ప్రస్తుత జనాభా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఊబకాయం. అలాంటప్పుడు కాలం చెల్లిన బీఎంఐలతో బరువు, ఎత్తు నిష్పత్తిలతో అంచనా వేస్తే సరిపోదని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీ ఒబెసిటీకి సరికొత్త నిర్వచనాన్ని మార్గదర్శకాలను అందించింది. అవేంటంటే..
ఊబకాయం అనే అధిక శరీర కొవ్వు. ఇది అనేక వ్యాధులకు కారణమయ్యే దీర్ఘకాలిక వ్యాధి. అలాగే ఇక్కడ బీఎంఐ అనేది శరీర కొవ్వును అతిగా లేదా తక్కువగా అంచనా వేయవచ్చు. అంతే తప్స స్పష్టమైన అంచనా మాత్రం ఇవ్వదు. అందుకని ఈ ఊబకాయాన్ని దీర్ఘకాలిక వ్యాధికి సరిగ్గా సరిపోయేలా అనారోగ్య స్థితిగా నిర్వచించారు. ఇది అవయవాలు, కణజాలల పనితీరుపై నేరుగా ప్రభావం చూపే అధిక కొవ్వుగా పరిగణించారు. దీన్ని బయో ఎలక్ట్రికల్ ఇంపెడెన్స్ లేదా డీఈఎక్స్‌ఏ స్కాన్లు వంటి ప్రత్యేక యంత్రాలతో కచ్చితంగా నిర్థారించగలమని అన్నారు.
అయితే ఇవి ఖరీదైనవి కావడంతో క్లినిక్‌లలో అందుబాటులో లేవు. ఇక ఊబకాయం ఉన్నవారికి శరీరంలో కొవ్వు ఎక్కడ పేరుకుపోయిందనేది ముఖ్యమట. అంటే బొడ్డు చుట్టూ ఉంటే ఇది అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. ప్రస్తుత మార్గదర్శకాలు బెల్లీఫ్యాట్(Belly Fat)ని తీవ్రమైన ఒబెసిటీ పరిగణించమని చెబుతోంది. అలాగే ఆయా వ్యక్తులకు మధుమేహం, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయనేది కూడా పరిగణలోనికి తీసుకోవాలట. కొత్త మార్గదర్శకాల్లో ఒబెసిటీని రెండు దశల్లో వర్గీకరించారు.
దశ1: అవయవ పనితీరుపై లేదా సాధారణ రోజువారీ కార్యకలాపాలపై స్పష్టమైన ప్రభావాలు లేకుండా పెరిగిన కొవ్వు (BMI > 23 kg/m². ఈ దశ ప్రస్తుతం ఎలాంటి అనారోగ్య సమస్యలు చూపించకపోయినా..భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటుందట.
దశ2: బీఎంఐ 23 కిలోలు/మీ2 కంటే ఎక్కువ ఉండి, పొట్ట చుట్టూ కొవ్వు, అధిక నడుము చుట్టుకొలత ఉంటే దీన్ని ఊబకాయంగా పరిగణిస్తారు. ఇది శారీరక అవయవ విధులను ప్రభావితం చేస్తుంది. టైప్2 డయాబెటిస్ వంటి వ్యాధులకు దారితీస్తుంది.
ఈ మార్గదర్శకాలను అక్టోబర్ 2022 నుంచి జూన్ 2023 వరకు ఐదు సర్వేలు నిర్వహించి మరీ అందిచినట్లు నిపుణుల చెబుతున్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత అందించిన ఈ మార్గదర్శకాలు ఆచరణాత్మకమైనవి, అలాగే ఆరోగ్య సమస్యలను ముందస్తుగా గుర్తించి నివారించడానికి ఉపయోగపడతాయని చెప్పారు.
(చదవండి: 32 ఏళ్లు ద్వీపంలో ఒంటరిగా బతికాడు! సడెన్‌గా జనాల్లోకి తీసుకురాగానే..)
Comments
Please login to add a commentAdd a comment