సకల రోగాలకు మూలం ఒబెసిటీ. ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువుంటే అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అందుకే అధిక బరువును తగ్గించుకునేందుకు చాలామంది నానా కష్టాలు పడుతూ ఉంటారు. జీవనశైలి మార్పులు, ఆహారఅలవాట్లుమార్చుకోవడంతోపాటు, కొన్ని ప్రత్యేక పదార్థాలను కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వాటిల్లో బాగా వినిపిస్తున్నది దాల్చిన చెక్క.
శరీరంలో కొవ్వును కరిగించడానికి దాల్చిన చెక్క నీరు, కషాయం, టీ బాగా ఎఫెక్టీవ్‌గా పని చేస్తుందని నమ్ముతారు. దాల్చిన చెక్క ఆకలిని నియంత్రిస్తుంది. జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే హార్మోన్ ఇన్సులిన్‌కుసరిగ్గా పనిచేసేలా చేస్తుంది. కొన్ని అధ్యయనాలు దాల్చినచెక్కను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని కూడా సూచిస్తున్నాయి.
దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. ముఖ్యంగా దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీంలోని మలినాలను బయటకు పంపుతాయి. దాల్చిన నీరు తాగడం వల్ల శరీరం మెటబాలిజం పెరుగుతుంది. దీంతో వెయిట్ లాస్ అయ్యేందుకు చక్కగా పని చేస్తుంది. ప్రతి రోజూ ఉదయం దాల్చిన చెక్క నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గొచ్చు.శరీరంలో చెడు కొలెస్ట్రాల్ త్వరగా కరుతుంది. ఫలితంగా స్థూలకాయం, అధిక బరువును తగ్గించుకోవచ్చు. ఈ వాటర్ తాగడం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి.
దాల్చిన చెక్కలో అనేక యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు వాపు తగ్గించడం ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు సహాయపడుతుంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. సాధారణ జలుబు, ఫ్లూ, వార్మ్ ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి ఇన్ఫెక్షన్లను నిర్వహించడంలోసహాయపడుతుంది. గవద జ్వరం వంటి అలర్జీ సమస్యల నివారణలో దాల్చిన చెక్క ఉపయోగ పడుతుంది. పురుషులలో అంగస్తంభన సమస్యతోపాటు, స్పెర్మ్ కౌంట్ పెంచుతుంది. మహిళల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యకు పని చేస్తుంది.
నోట్: అందరికీ ఈ చిట్కా మనచేస్తుందని చెప్పలేం. కానీ కచ్చితంగా కొన్ని ప్రయోజనాలు న్నాయి. అయితే ఆరోగ్యకరమైన జీవన శైలి, క్రమం తప్పని, వ్యాయామం బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయిని మాత్రం మర్చిపోకూడదు.
Comments
Please login to add a commentAdd a comment